Kottu Satyanarayana : ఒక్కో దేవాలయానికి రూ.10 లక్షలు..!
త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల (temple) అభివృద్ధి చేస్తాం.. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana)తెలిపారు. ఆ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వివాదంలో ఉన్న 4,700 ఎకరాలను సంబంధిత దేవస్థానాలకు చెందేలా జీవో తీసుకొస్తున్నాం అని వెల్లడించారు..
త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల (temple) అభివృద్ధి చేస్తాం.. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana)తెలిపారు. ఆ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వివాదంలో ఉన్న 4,700 ఎకరాలను సంబంధిత దేవస్థానాలకు చెందేలా జీవో తీసుకొస్తున్నాం అని వెల్లడించారు.. డీఐజీ (DIG)స్థాయి అధికారులతో విజిలెన్స్( Vigilance)సెల్ ఏర్పాటు కాబోతోంది.. దేవాలయాల్లో 3 రకాలుగా టెండర్లు పిలుస్తాం అన్నారు.. పూజలకు కావాల్సిన సామాగ్రికి రూ. కోటి టర్నోవర్ ఉన్నవారు పాల్గొనవచ్చు అని తెలిపిన ఆయన.. అన్న ప్రసాదం తయారీ కోసం రూ. 2 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు టెండర్లు పాల్గొనవచ్చు అన్నారు.. అమ్మవారి ప్రసాదం పోటుకి కావాల్సిన సామాగ్రికి రూ. 5 కోట్ల టర్నోవర్ ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ఇక, క్వాలిటీ కంట్రోల్ కోసం స్పెషల్ టీం ఎప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు మంత్రి కొట్టు.. రాష్ట్రంలో ప్రధానంగా 175 ఆలయాలు ఆన్ లైన్ చేశామన్న ఆయన.. దీని ద్వారా ఏ రోజు డేటా ఆ రోజు తెలుసుకోవచ్చు అన్నారు. త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల అభివృద్ధి చేస్తాని.. దాని కోసం ఒక్కో దేవాలయానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు.. మరోవైపు.. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో(Srisailam) ఆర్టీసీ (RTC)డిపో నిర్మాణానికి 4 ఎకరాల కేటాయించనున్నట్టు వెల్లడించారు. 175 ఆలయాలకు ఐటీకి సంబంధించి స్పెషల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.