వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) విచారణలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి నోటీసులు ఇచ్చింది సీబీఐ (CBI).
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) విచారణలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి నోటీసులు ఇచ్చింది సీబీఐ (CBI). ఇది వరకే నోటీసులు ఇచ్చిన విచారణ సంస్థ శుక్రవారం మరొకసారి నోటీసులు జారీ చేసింది. కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్ హౌస్ కు శనివారం (ఈ రోజు) ఉదయం పది గంటలకు హాజరు కావాలని అందులో పేర్కొన్నది. అంతకు ముందు 23 వ తేదీన హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా తనకు ముందస్తు పనులు ఉన్నందున రాలేనని చెప్పారు. దీంతో మరోసారి నోటీసులు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రశ్నల వర్షం కురిపించింది. గంగిరెడ్డి తో ఉన్న సంబంధాలు, సునీల్ యాదవ్ ఆ రోజు మీ ఇంట్లో ఎందుకు ఉన్నారు.. వంటి ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తుంది. మూడు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం అవినాష్ మాట్లాడుతూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, మీడియా వాస్తవాలను వక్రీకరించకుండా ప్రసారం చేయాలని సూచించారు. వివేకా హత్య కేసు అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాకలు చేసిన సీబీఐ అనేక విషయాలు వెల్లడించింది.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పైన పులివెందులకు చెందిన భరత్ కుమార్ అనే విలేకరి (reporter) మీడియా సమావేశం నిర్వహించి శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలుసిందే. ఈ కేసులో A2 ఉన్న సునీల్ యాదవ్, 2019 మార్చి 14 వ తేదీ రాత్రి సమయంలో వైయస్ భాస్కర్ రెడ్డి (ys Bhaskar Reddy) ఇంట్లో సునీల్ ఉన్నాడని కొన్ని పత్రికలు అవాస్తవాలను ప్రచారం చేయడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించింది అన్నాడు. కానీ ఆ రోజు సునీల్ యాదవ్ తనతో ఉన్నాడని చెప్పాడు. సునీల్, తను ఇద్దరం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు నందిక హాస్పిటల్ వద్ద ఇద్దరం కలిసే ఉన్నట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సిబిఐకి ఇచ్చినట్లు చెప్పాడు వీడియో ఫుటేజ్ కూడా ఉన్నదని, దానిని కూడా సిబిఐ నిర్ధారించింది అన్నాడు. కానీ కొన్ని పత్రికలు, అధికారులు మాత్రం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశాడు. ఎందుకు ఇంత అవాస్తవాలు చెబుతున్నారని ప్రశ్నించాడు. అధికారులు చెప్పనప్పటికీ కొన్ని పత్రికలు అవస్థలు రాస్తున్నాయి కావచ్చు… అది మాత్రం తనకు నాకు తెలియదు అన్నాడు. ఈ కేసులో మొదట సిబిఐ వారు తనను కూడా అనుమానించిజ్ ప్రశ్నించినట్లు చెప్పాడు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా వారు తనను పిలిపించడంతో.. వెళ్లి అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినట్లు వెల్లడించాడు.