»Guntur Sp Arif Hafeez Arrested Fake It Raids Guntur Thieves Who Stole 50 Lakhs
Fake IT Raids: ఐటీ అధికారులమని 50 లక్షలు దోచుకున్న కేటుగాళ్లు..చివరకు అరెస్ట్
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఐటీ అధికారులమని 50 లక్షలు దోచుకున్న దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 లక్షల రూపాయలకు గాను రూ.48.30 లక్షల నగదు, అరకిలో గోల్డ్ కు గాను 132 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు.
సినిమాల్లో మాదిరిగా ఐటీ అధికారుల(it officers)మని పలువురు ఇళ్లలో దుండగులు దాడులు నిర్వహించారు. ఆ క్రమంలో వారిని నిజమైన ఐటీ ఆఫీసర్లమని నమ్మించి వారి వద్ద నుంచి డబ్బు, నగదును తీసుకెళ్లారు. ఆ క్రమంలో ఇంటీలో తనిఖీలు చేపట్టి దాదాపు 50 లక్షల నగదుతోపాటు బంగారాన్ని కూడా దోచుకెళ్లారు. అయితే ఇది మాత్రం రీల్ సీన్ కాదు. నిజంగా జరిగింది. ఏపీ(ap)లోని గుంటూరు(guntur) ప్రగతినగర్లో ఇటీవల జరిగిన ఘటనను పోలీసులు(police) ఛేధించారు. ఈ కేసులో ఐదుగురిని పట్టుకున్నారు. వారి నుంచి 50 లక్షల రూపాయలకు గాను రూ.48.30 లక్షల నగదుతోపాటు.. అరకిలో గోల్డ్ కు గాను 132 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్(sp arif hafeez) సహా పలువురు అధికారులు వెల్లడించారు.
అయితే సింగంశెట్టి కల్యాణ్ అనే మహిళ కొన్ని రోజుల నుంచి ఓ ఉన్నత కుటుంబానికి చెందిన దొడ్డ ప్రసాద్ ఇంట్లో పనిచేసేది. ఆ క్రమంలో ప్రసాద్ ఒంటరిగా ఉండేవాడు. తన వద్ద ఉన్న డబ్బు నగలు కూడా ఎవరికీ అనుమానం రాకుండా కల్యాణి ఇంట్లోనే దాచాడు. ఈ నేపథ్యంలో ఓ పెట్టెలోని బియ్యం డబ్బాలో వాటిని మహిళ దాచిపెట్టింది. అయితే కల్యాణి(kalyani) ఇంట్లో(house) డబ్బులున్నాయని సమీపంలోని జాన్, ఏసుబాబుకు పలువురి ద్వారా సమాచారం తెలిసింది. ఆ క్రమంలో ఎలాగైనా వాటిని దోచుకోవాలని మంచి ప్లాన్ వేశారు.
అందుకోసం సురేష్, విజయ్ కుమార్ తో కలిసి వారు ఐటీ అధికారులమని తెలిపి కల్యాణి(kalyani) ఇంట్లోకి వెళ్లారు. ఆమెను బయపెట్టి డబ్బు, బంగారం పట్టుకెళ్లారు. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న సీసీ కెమెరా రికార్డు సెట్ ను కూడా లాక్కుని వెళ్లారు. విషయం బాధితురాలు యజమానితోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు(police) ఐదు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో టెక్నాలజీ సాయంతో నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేసినట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్(sp arif hafeez) స్పష్టం చేశారు.