మహిళల ఐపీఎల్ ఇంకొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ తరుణంలో శనివారం ముంబయి ఇండియన్స్ జట్టు తొలుత మహిళల ప్రీమియర్ లీగ్ జెర్సీని రిలీజ్ చేసింది. ఆ జెర్సీలో ముంబైలోని సూర్యుడు, సముద్రం సహా నీలం, బంగారు, లేత ఎరుపు రంగులను కలిగి ఆద్భుతుంగా ఉందని చెప్పవచ్చు.
మహిళల ఐపీఎల్(WPL) కోసం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్లు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ముంబయి ఇండియన్స్ జట్టు(Mumbai Indians team)మొట్టమొదటి మహిళల ప్రీమియర్ లీగ్ జెర్సీని ఆవిష్కరించింది. దీనిలో ముంబైలోని సూర్యుడు, సముద్రం సహా నీలం, బంగారు, లేత ఎరుపు రంగులను కలిగి ఉంది. ఇది సూపర్ హీరోలు ధరించే జెర్సీ – మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ జెర్సీ అని.. మేమంతా ఈ జెర్సీని ఎంతో ఇష్టపడుతున్నామని జట్టు యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇక ముంబై ఇండియన్స్ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. మార్చి 4న ఈ టోర్నమెంట్ ముంబైలో డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. మొదటి పోరులో గుజరాత్ జెయింట్స్(gujarat giants)తో ముంబయి జట్టు పోటీ పడనుంది.
భారత క్రీడాకారిణి స్మృతి మంధాన(smriti mandhana)ను అత్యధికంగా 3.40 కోట్ల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కొనుగోలు చేసింది. టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(harmanpreet kaur)ను ముంబై ఇండియన్స్ రూ.1.80 కోట్లకు దక్కించుకుంది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆటగాళ్లు కూడా ఐదు ఫ్రాంచైజీలలో భాగంగా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ నటాలీ స్కివర్లు వరుసగా INR 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు కొనుగోలు చేశాయి. మరోవైపు ఇండియా U19 స్టార్స్ నుంచి ICC U19 T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్, షఫాలీ వర్మను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది.
మొదటి ఎడిషన్‌లో ఐదు జట్లు ఉండగా వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్(gujarat giants), ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియోర్జ్ ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ సర్క్యూట్లో వీరు అత్యుత్తమ ప్రతిభను కనబర్చడానికి ఇది ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. మహిళల జట్టు కోసం కొత్తగా ఏర్పడిన కోచింగ్ టీమ్‌లో షార్లెట్ ఎడ్వర్డ్స్ (హెడ్ కోచ్), ఝులన్ గోస్వామి (టీమ్ మెంటార్, బౌలింగ్ కోచ్), దేవికా పల్షికార్ (బ్యాటింగ్ కోచ్) ఉన్నారు. మొదటి సీజన్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(women premier league)లో మొత్తం 20 మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో రెండు ప్లేఆఫ్ గేమ్‌లతో సహా 23 రోజుల వ్యవధిలో ఆడనున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్ మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది.