• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Bhupalpally రేవంత్ యాత్రలో ఉద్రిక్తత.. కోడిగుడ్లు, టమాటాలు, సీసాలతో దాడి

దాడికి పాల్పడిన వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభపై దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నారు. నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేడ్కర్ చౌరస్తాకు రా.. నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకుని పోతా

March 1, 2023 / 06:56 AM IST

Viral Video: నెక్ డ్యాన్స్ వీడియో..నెట్టింట వైరల్

ఓ కార్యక్రమంలో భాగంగా ఓ వ్యక్తి చేసిన నెక్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోను ఓ డాక్టర్ నెట్టింట పోస్ట్ చేయగా..ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.

February 28, 2023 / 09:44 PM IST

Delhi liquor scam:కేసులో ఐదుగురికి బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో సీబీఐ(cbi) దర్యాప్తు చేస్తున్న సమీర్ మహేంద్రు, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూత గౌతమ్‌లకు అవెన్యూ కోర్టు ఈరోజు రెగ్యులర్ బెయిల్(bail) మంజూరు చేసింది.

February 28, 2023 / 09:21 PM IST

Upasana: ఇండియాలోనే చిన్నారి డెలివరీ ఉపాసన క్లారిటీ

స్టార్ హీరో రామ్ చరణ్, తన భార్య ఉపాసన కామినేని వారి బిడ్డకు అమెరికాలో జన్మనివ్వబోతున్నట్లు వచ్చిన పుకార్లపై ఉపాసన క్లారిటీ ఇచ్చింది. అవన్నీ నిజాలు కాదని ఇండియాలోనే తాను చిన్నారికి జన్మనివ్వనున్నట్లు స్పష్టం చేసింది.

February 28, 2023 / 08:48 PM IST

BJP MLA Raja Singh: పార్టీ అధిష్టానానికి అల్టిమేటం.. కానీ!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తమ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయకుంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తనకు ఇతర పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఉద్దేశం లేదన్నారు. అయితే తనకు బీజేపీ నాయకత్వం తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.

February 28, 2023 / 07:42 PM IST

TSPSC: గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్…కానీ గ్రూప్ 4 అభ్యర్థుల ఆవేదన!

తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగాల్లో అనేక జిల్లాలలో తమకు పోస్టులను కేటాయించడంలో అన్యాయం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.

February 28, 2023 / 07:38 PM IST

GHMC: కుక్కల దాడిలో బాలుడి మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం

భాగ్యనగరంలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ వార్త సంచలనంగా మారింది. అయితే ఈ బాలుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తాజాగా జీహెచ్ఎంసీ ప్రకటించింది. వీటిలో కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2 లక్షలు, మిగతావి జీహెచ్ఎంసీ నుంచి ఇస్తామని వెల్లడించింది.

February 28, 2023 / 07:11 PM IST

Medico Preethi: ర్యాగింగ్ విషయం తెలియదన్న ప్రిన్సిపల్

సైఫ్ (saif) రూపంలో ర్యాగింగ్ భూతానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ వేధింపుల పర్వం గురించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ (Kakatiya Medical College) మోహన్ దాస్ స్పందించారు.

February 28, 2023 / 06:43 PM IST

Arvind Kejriwal: ఇద్దరు మంత్రుల రాజీనామాలకు అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారి రాజీనామాలను ఆమోదించారు.

February 28, 2023 / 06:26 PM IST

Sachin Tendulkar: వాంఖేడేలో అరుదైన గౌరవం, సచిన్ ఏమన్నారంటే

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు (Sachin Tendulkar) అరుదైన గౌరవం. ముంబైలోని (Mumbai) వాంఖేడే స్టేడియంలో (Wankhede Stadium) మాస్టర్ బ్లాస్టర్ నిలువెత్తు విగ్రహాన్ని (Sachin Tendulkar Life size Statue) పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

February 28, 2023 / 06:00 PM IST

Bandi Sanjay: తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో భారీ సభలు..పోటీ కూడా చేస్తాం

తెలంగాణాలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో భారీ సభలు ఏర్పాటు చేయడంతోపాటు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

February 28, 2023 / 06:02 PM IST

Goutham Gambhir : మనీశ్ సిసోడియా పై గౌతమ్ గంభీర్ విమర్శలు..!

Goutham Gambhir : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల ఆయనను ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఈ విషయంపై గంభీర్ స్పందించారు.

February 28, 2023 / 05:40 PM IST

Medico Preethi: ప్రీతి తల్లిదండ్రులకు కవిత బహిరంగ లేఖ

సైఫ్ (saif) అనే ఉన్మాది ఘాతుకానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తల్లిదండ్రులకు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

February 28, 2023 / 05:23 PM IST

Snapchat:లో My AI’ చాట్‌బాట్‌ ఫీచర్ అందుబాటులోకి

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం, మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్‌ ప్రయోగాత్మకంగా My AI చాట్‌బాట్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇంకోవైపు ఇప్పటికే మెటా సంస్థతోపాటు జూమ్ కంపెనీ కూడా ఈ టెక్నాలజీని వారి సంస్థల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

February 28, 2023 / 05:15 PM IST

RGV : బాలుడిపై కుక్క దాడి… మేయర్ విజయలక్ష్మీపై మరోసారి వర్మ సెటైర్లు..!

RGV : ఇటీవల ఓ నాలుగేళ్ల చిన్నారి పై వీధి కుక్కలు దాడి చేయగా... ఆ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.

February 28, 2023 / 04:50 PM IST