• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

IND vs AUS: భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా..6 వికెట్లు తీసిన అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్(IND vs AUS) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టు(Test)లో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేశాడు. అలాగే ఆసీస్ ఆల్ రౌండర్ అయినా కామెరాన్ గ్రీన్ 114 పరుగులు చేశాడు. వీరిద్దరి భారీ స్కోరు వల్ల ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

March 10, 2023 / 05:21 PM IST

H3N2 Influenza : దేశంలో అలర్ట్: రెండు ఇన్ ఫ్లుయెంజా మరణాలు నమోదు..!

H3N2 Influenza : ఇప్పుడిప్పుడే జనాలు కరోనా నుంచి బయటపడుతున్నారు. ఈ క్రమంలో... తాజాగా హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లుయెంజా పేరిట మరో వైరస్ కలకలం రేగడం మొదలుపెట్టింది. ఇప్పటికే దేశంలో రెండు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటక,హర్యానా రాష్ట్రాల్లో ఇద్దరూ చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.

March 10, 2023 / 04:07 PM IST

Avinash reddyని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దు.. సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం

Avinash reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి కాస్త ఊరట కలిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆయనను పలుమార్లు సీబీఐ విచారించింది. అయితే ఈ రోజు కూడా విచారించాల్సి ఉంది. ఇంతలో సీబీఐ అధికారుల తీరు గురించి అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

March 10, 2023 / 04:56 PM IST

liquor scamలో మనీశ్ సిసోడియాది ప్రత్యక్ష పాత్ర: కోర్టుకు తెలిపిన ఈడీ

Manish Sisodia:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) మనీశ్ సిసోడియాది (manish sisodia) ప్రత్యక్ష పాత్ర ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. కొందరి వ్యక్తిగత ప్రయోజనం కోసం లిక్కర్ పాలసీ రూపొందించారని పేర్కొంది. ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోకుండానే హోల్‌సేల్ (wholesale) వ్యాపారులకు 12 శాతం లాభం చేకూర్చేందుకు పాలసీ రూపొందించారని వివరించింది.

March 10, 2023 / 04:59 PM IST

YS Sharmila ఢిల్లీ లో కవిత దీక్ష పై సెటైర్లు….!

YS Sharmila : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. దేశరాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె దీక్షకు చాలా మంది మహిళలు మద్దతు పలుకుతున్నారు. కాగా... కవిత దీక్ష పై షర్మిల సెటైర్లు వేశారు. క‌విత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని..కేసీఆర్ ఇంటి ముంద‌ని ష‌ర్మిల అన్నారు.

March 10, 2023 / 02:53 PM IST

Ramachandra Pillai: ఢిల్లీ లిక్కర్ కేసులో వాంగ్మూలం వెనక్కి!

ఈడీ(ED)కి ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటూ హైదరాబాద్(hyderabad) వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై(Ramachandra Pillai) ఢిల్లీ(delhi) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఈడీ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది. అయితే అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉన్నట్లు గతంలో ఈడీ(ED)కి తెలిపాడు. ఇప్పుడు అదే వాంగ్మూలం వెనక్కి తీసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

March 10, 2023 / 02:37 PM IST

IRCTC scam: తేజస్వి యాదవ్ నివాసంలో ఈడీ సోదాలు

ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుండి (Land for jobs scam case) ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం (Lalu Prasad Yadav family) భూములు తీసుకున్నదన్న అభియోగాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కేంద్ర విచారణ సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) తేజస్వి యాదవ్ నివాసంలో ఢిల్లీలోని (Tejaswi Yadav) నివాసంలో సోదాలు నిర్వహించింది.

March 10, 2023 / 02:25 PM IST

Venu Yeldandi జబర్దస్త్ అందుకే మానేశా: వేణు టిల్లు

మంచి పారితోషకం (Remuneration) వస్తున్న సమయంలోనే నేను బయటకొచ్చా. నేను ఉన్నప్పుడు రేటింగ్ (Rating) కూడా బాగుంది. కానీ సినిమా కోసం బయటకు వచ్చా అంతే!’

March 10, 2023 / 02:16 PM IST

R Krishnaiah: బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

పార్లమెంటులో బీసీ(BC) బిల్లు(Bill) ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని చట్టసభల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు(reservations) కల్పించాలని కోరారు. బీసీ(BC)లకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు అంశంపై ఏప్రిల్ 3న ఢిల్లీ(delhi)లో ధర్నా చేయనున్నట్లు చెప్పారు.

March 10, 2023 / 01:57 PM IST

K Kavitha Deekshaపై బీజేపీ అలర్ట్.. సంజయ్, డీకే అరుణకు నడ్డా ఫోన్

తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం అభినందనీయం. మహిళా సమస్యలపై పోరాడుతున్న తీరు భేష్. తెలంగాణ మహిళలకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వాలి.

March 10, 2023 / 01:50 PM IST

BJP targets AAP: 400 రోజుల్లో 10 కేజ్రీవాల్ కుంభకోణాలతో ముందుకు…

దేశానికి సరికొత్త రాజకీయాలను (politics) పరిచయం చేస్తామని, అవినీతి లేని రాజకీయమే (Clean Politics) తమ లక్ష్యమని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాత్రం నిండా అవినీతిలో మునిగిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పకడ్బంధీగా ముందుకు సాగేందుకు సద్ధమవుతోంది.

March 10, 2023 / 01:39 PM IST

Kavitha Protest దీక్షలు చేసే అర్హత కవితకు లేదు: బండి సంజయ్

మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women's Reservation Bill) కోసం ఢిల్లీ (New Delhi)లో కవిత దీక్ష చేస్తుండగా ఆమెకు పోటీగా హైదరాబాద్ (Hyderabad)లో బీజేపీ ‘మహిళ గోస- బీజేపీ భరోసా దీక్ష’ అనే కార్యక్రమం చేపట్టింది. హఠాత్తుగా ఈ దీక్ష పెట్టడానికి కారణం కవిత దీక్షను దారి మళ్లించేందుకు, హైప్ తగ్గించేందుకు చేసినట్లు తెలుస్తోంది.

March 10, 2023 / 01:41 PM IST

Naveenను చంపుతానని హరిహర నెలకిందే చెప్పాడు, పోలీసుల విచారణలో నిహారిక

Naveen:బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పోలీసుల విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. నిహారిక (niharika) ఈ రోజు పలు కీలక అంశాలను తెలిపింది. హరి హర (hari hara) తాను లవ్ (love)లో ఉన్నామని చెబుతూనే.. నవీన్ (Naveen) హత్య గురించి ప్రస్తావించింది.

March 10, 2023 / 01:13 PM IST

KTR:కు మరోసారి సవాల్ విసిరిన కోమటిరెడ్డి రాజగోపాల్

మీకు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే తాను బీజేపీలో చేరినందుకు 18వేల కోట్ల కాంట్రాక్టు పొందానని చేసిన ఆరోపణలను నిరూపించాలని బీజేపీ(BJP) నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal reddy) మంత్రి కేటీఆర్(KTR)కు సవాల్ విసిరారు. తనపై తప్పుడు ప్రచారం చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ గెలిచిందని పేర్కొన్నారు.

March 10, 2023 / 01:01 PM IST

Hyderabad వాసులకు గమనిక.. 3 నెలలు ఈ రోడ్లు బంద్

అభివృద్ధి పనుల కోసం ప్రజలు కొన్ని రోజులు సహకరించాలని విన్నవించారు. మళ్లింపుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లితే ప్రయోజనంగా ఉంటుందని చెప్పారు. స్థానికులు సహకరించాలని కోరారు.

March 10, 2023 / 12:57 PM IST