»Ministers Botsa Amarnath Face To Face With Balakrishna In Ap Assembly
MLA Balakrishna: ఏం హీరో గారు.. బాలకృష్ణతో బొత్స, గుడివాడ, అంబటి సరదాగా…
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో హిందూ పురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆయన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అని తెలిసిందే. ప్రాంగణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చిట్ చాట్ చేశారు. పరస్పరం సరదాగా మాట్లాడుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో హిందూ పురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆయన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అని తెలిసిందే. ప్రాంగణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చిట్ చాట్ చేశారు. పరస్పరం సరదాగా మాట్లాడుకున్నారు.
బాలకృష్ణను చూసిన మంత్రి బొత్స సత్యనారాయణ… ఏం హీరో గారూ… అంటూ పలకరించారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డిని చూసిన బాలయ్య… ఏం ఈ రోజు కోటు వేసుకు రాలేదేం అని చమత్కరించారు.
మరో మంత్రి అంబటి రాంబాబు కూడా సరదాగా బాలయ్యను మాట్లాడించారు.
అదే సమయంలో తాజా రాజకీయాలు, రోడ్ల పరిస్థితి పైన ఆయన ఆరా తీశారు. అసెంబ్లీకి వెళ్లే రహదారిని పరిశీలించారు. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే బాధగా ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. వీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల (andhra pradesh budget 2023) సందర్భంగా నేడు (గురువారం, మార్చి 16) ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి (AP Finance Minister Buggana Rajendranath Reddy) అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో తెలుగు దేశం పార్టీ సభ్యులు (Telugu Desam Party MLAs) ఆందోళన చేశారు. పోడియం వద్దకు దూసుకెళ్లారు. పేపర్లు పోడియం వైపు విసిరారు. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh) వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సభ నుండి సస్పెండ్ (tdp mlas suspended) చేయాలని స్పీకర్ తమ్మినేనికి (Speaker tammineni sitaram) సూచించారు. దీంతో సభాపతి 14 మంది తెలుగు దేశం పార్టీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.