»Uk Pm Rishi Sunak Breaks The Rule By Letting The Dog Roam Freely In Park
Rishi Sunak breaks the rule: పార్కులో నిబంధనలు ఉల్లంఘించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ (UK PM Rishi Sunak), ఆయన సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) వివాదంలో చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్కుకు (Family Park) వెళ్లిన ప్రధాని అక్కడి నిబంధనలు ఉల్లంఘించారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ (UK PM Rishi Sunak), ఆయన సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) వివాదంలో చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్కుకు (Family Park) వెళ్లిన ప్రధాని అక్కడి నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో పోలీసులు ఆయనకు నిబంధనలను గుర్తు చేయవలసి వచ్చింది. ఈ ఘటన శనివారం జరిగింది. విషయం వెలుగు చూసిన తర్వాత నెట్టింట వైరల్ గా మారింది. రిషి సునక్, అక్షతా, వారి కుటుంబం లండన్ లోని హైడ్ పార్కుకు (london hyde park) వెళ్లారు. వారు తమతో పాటు తమ పెంపుడు శునకంను తీసుకు వెళ్లారు. దాని పేరు నోవా. ఈ పార్కులో ఉన్న సెర్పంటైన్ సరస్సు సమీపంలో వారు నడక సాగిస్తున్నారు. ఆ సమయంలో తమ పెంపుడు శునకాన్ని స్వేచ్ఛగా వదిలేశారు.
ఈ పార్కులో కుక్కలకు బెల్టు కట్టకుండా తిప్పడం నిబంధనలకు విరుద్ధం (Rishi Sunak breaks the rule). ఈ విషయాన్ని పేర్కొంటూ అక్కడ బోర్డులు కూడా ఉన్నాయి. నోవాను స్వేచ్ఛగా వదిలేయడాన్ని గమనించిన… రిషి సునక్ భద్రతా దళంలోని ఓ పోలీసు అధికారి ఆయనకు పార్కు నిబంధనలను గుర్తు చేశారు. వెంటనే ఆ కుటుంబ సభ్యులు నోవాకు బెల్టు పెట్టారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సునక్ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. గతంలో కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా రిషి ప్రయాణించడంతో జరిమానా విధించారు. అప్పుడు ఆయన క్షమాపణ చెప్పారు.