భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నేడు గురువారం (మార్చి 16) రెండోసారి కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ ( investigation enforcement directorate) ఎదుట హాజరు అవుతున్నారు.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నేడు గురువారం (మార్చి 16) రెండోసారి కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ ( investigation enforcement directorate) ఎదుట హాజరు అవుతున్నారు. కవిత (MLC Kavitha) విచారణ నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు (K Chandrasekhar Rao) నివాసం వద్ద 144 సెక్షన్ విధించారు. నేడు కవిత విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు, మహిళా మంత్రులు, ఎంపీలు, పలువురు నేతలు నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. కవితకు మద్దతుగా బీఆర్ఎస్ బల ప్రదర్శన కనిపిస్తోంది. ఈ నెల 11వ తేదీన తొలిసారి కవితను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ రోజు రెండోసారి విచారిస్తున్నారు. ఈడీ దర్యాఫ్తు ప్రధానంగా ధ్వంసం చేసిన పది ఫోన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఈడీ కార్యాలయానికి వెళ్లడానికి ముందు కవిత మీడియాతో క్లుప్తంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.
ఈ రోజు కవితను అరెస్ట్ చేస్తారా?
బీఆర్ఎస్ (BRS) కేడర్ పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లడంతో… పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈడీ కార్యాలయానికి కేంద్ర బలగాలు చేరుకున్నాయి. కవిత విచారణకు బయలుదేరడానికి ముందు కవిత-కేసీఆర్ నివాసం వద్ద, ఈడీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు. ఈ పరిస్థితి చూస్తుంటే కవితను ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. రెండోసారి విచారణ నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబులు తమ వాంగ్మూలంలో కవిత పేరును పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ ఈమెకు నోటీసులు జారీ చేసి, విచారిస్తోంది. ఈడీ సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ, అక్కడ చుక్కెదురైన విషయం తెలిసిందే. దీంతో ఆమె నేడు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.