SKLM: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ శ్రీకూర్మం క్షేత్రం పుష్కరిని, పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకూర్మం పుష్కరిని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఏ ఏ ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టాలో క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.