»Spread Of Xbb 1 16 New Variant Covid Cases Increasing In Telangana
XBB1.16 కొత్త వేరియంట్ వ్యాప్తి..తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు!
తెలంగాణలో కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసుల(covid infection cases) సంఖ్య క్రమంగా ఎక్కువవుతుంది. రాష్ట్రంలో మంగళవారం 52 కోవిడ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్లు రికార్డు కాగా, బుధవారం 54 కోవిడ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటి పెరుగుదలకు కారణం SARS-CoV-2 కొత్త రీకాంబినెంట్ వేరియంట్ XBB1.16 అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది మహారాష్ట్ర నుంచి క్రమంగా తెలంగాణకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు.
తెలంగాణ(telangana)లో క్రమంలో కోవిడ్ ఇన్ఫెక్షన్ల(covid infections) సంఖ్య పెరుగుతుంది. రాష్ట్రంలో మంగళవారం 52 కోవిడ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్లు రికార్డు కాగా, బుధవారం 54 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీటి వ్యాప్తికి గల కారణం SARS-CoV-2 యొక్క కొత్త రీకాంబినెంట్ వేరియంట్ XBB1.16 అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది మహారాష్ట్ర(Maharashtra)లో ఉద్భవించి అక్కడి నుంచి క్రమంగా తెలంగాణ రాష్ట్రానికి వ్యాపించినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి జరగుతున్నట్లు వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు(covid positive rate) పెరిగింది. ఇది కాలానుగుణంగా H3N2 ఇన్ఫ్లుఎంజా పెరుగుదలతో సమానంగా ఉంది. ఒక్క రోజులోనే మహారాష్ట్ర(Maharashtra)లో మంగళవారం 155 పాజిటివ్ ఇన్ఫెక్షన్లు(covid infections), రెండు మరణాలు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అయితే ప్రపంచవ్యాప్తంగా కొత్త SARS-CoV-2 వేరియంట్ వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సంస్థ GISAID ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో కొత్త SARS-CoV-2 వేరియంట్ల డేటాతోపాటు పలు సూచనలను అందించింది. దీని ద్వారా అనేక భారతీయ రాష్ట్రాల్లో XBB 1.16 వ్యాపిస్తుందని వెల్లడించింది.
కొత్త వేరియంట్లను ట్రాక్ చేస్తున్న జీవశాస్త్రవేత్తల సమాచారం ఆధారంగా భారతదేశం(india)లో జనవరి, ఫిబ్రవరిలో XBB 1.16 వృద్ధి శాతం దాదాపు 2 శాతంగా ఉందని పేర్కొన్నారు. కానీ అది మార్చి నాటికి వృద్ధి రేటు దాదాపు 40 శాతానికి పెరిగింది. XBB 1.16 వైరస్ వ్యాప్తి సమాచారం పూర్తిగా అందుబాటులో లేనప్పటికీ, కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు.
సింగపూర్లో భారతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలిన క్రమంలో వారిని పరీక్షించినప్పుడు కొత్త రీకాంబినెంట్ వేరియంట్ మొదట దృష్టికి వచ్చిందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం, భారతదేశం(india) కాకుండా, యునైటెడ్ స్టేట్స్(USA), సింగపూర్, బ్రూనైలలో XBB1.16 వేరియంట్ పెద్ద ఎత్తున చెలామణిలో ఉన్నట్లు తేలింది.