Animal movie: 3 రోజుల్లోనే యానిమల్ బడ్జెట్ వచ్చేసింది..ఇక అంతా లాభమే
రణబీర్ కపూర్ తాజా చిత్రం యానిమల్ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే దేశీయ బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.350 కోట్ల క్లబ్లో చేరింది. అయితే అసలు ఈ చిత్ర బడ్జెట్ ఎంత? పెట్టిన మొత్తం వచ్చిందా లేదా అనేది ఇప్పుడు చుద్దాం.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్(ranbir kapoor) కాంబోలో వచ్చిన యానిమల్(animal) చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ ఖాన్-నటించిన పఠాన్ మూడు-రోజుల కలెక్షన్‌ను కూడా ఈ యాక్షన్ చిత్రం అధిగమించింది. అయితే ఇది అట్లీ కుమార్ SRK చిత్రం జవాన్ సృష్టించిన రికార్డు కంటే తక్కువగా ఉంది. మూడు రోజుల్లోనే యానిమల్ చిత్రం భారతదేశంలో రూ.200 కోట్ల క్లబ్లో చేరగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల క్లబ్లో ప్రవేశించింది. దీంతో జవాన్ తర్వాత ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా యానిమల్ నిలిచింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ, అపూర్వమైన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ సినిమాను 150 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే పెట్టిన బడ్జెట్ పోగా..100 కోట్లకుపైగా లాభమే వచ్చిందని చెప్పవచ్చు.
Unstoppable.. All guns blazing! 💥💥#Animal has officially crossed the $6 million mark at North America box office! 💪
The numbers are still soaring and it will cross many more milestones 🤘🔥
ఈ చిత్రం దేశవ్యాప్తంగా థియేటర్లలో మూడవ రోజు రూ.72.50 కోట్లు వసూలు చేసిందని Sacnilk వెబ్ సైట్ ముందస్తు అంచనాల ప్రకారం వెల్లడించింది. మునుపటి రోజుతో పోలిస్తే మూడో రోజు బాక్సాఫీస్ వసూళ్లలో 8.5 శాతం పెరుగుదల కనిపించింది. దీంతో ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.202.57 కోట్ల నికర వసూళ్లను సాధించింది. అయితే ఇదే సమయంలో జవాన్ చిత్రం రూ.206.06 కోట్లను సాధించింది. పఠాన్ రూ.166.75 కోట్లను ప్రస్తుతం యానిమల్ చిత్రం చిత్తు చేసింది.
ఆదివారం యానిమల్ హిందీ మార్కెట్లో మొత్తం 79.05 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. ప్రారంభంలో, మార్నింగ్ షోల సమయంలో ఈ చిత్రం హిందీ మార్కెట్లో 65.53% ఆక్యుపెన్సీని పొందింది. అయితే రోజు గడిచేకొద్దీ, క్రమంగా ఆక్యుపెన్సీ స్థిరంగా పెరుగుతోంది. మధ్యాహ్నం షోల సమయంలో 84.58కి, సాయంత్రం షోల సమయంలో 86.42కి చేరాయి. రాత్రి స్క్రీనింగ్‌ల సమయంలో ఈ శాతం కొద్దిగా తగ్గి 79.66గా ఉంది.