»Nani Shruti Love Story In Hi Nanna Is Very Interesting
Hi Nannaలో నాని-శృతి లవ్ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్
నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా తెరకెక్కిన హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంలో నాని- శృతి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందట.
Hi Nanna: శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా తెరకెక్కిన హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బేబీ కియారా కీలకపాత్ర పోషించింది. అలాగే శృతిహాసన్ కూడా ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజ్ సన్నివేశాలు ఉన్నాయట. నాని, శృతి ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందట. అలాగే వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఎంతో అందంగా, ఇంట్రెస్ట్‌గా సాగిన వీళ్ల ప్రేమ కథ ముగింపు అంతే బాధాకరంగా ఉంటుందని తెలుస్తోంది. అన్నింటికంటే మించి శృతిహాసన్ పాత్ర ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా సాగుతుందని టాక్.
వైరా ఎంటర్టైన్మెంట్స్లో రాబోతున్న ఈ సినిమాకి హీషం అబ్దుల్ సంగీతం అందించారు. పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో తండ్రి, కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం చాలా ఎమోషనల్‌గా ఉంటుందట. అలాగే మృణాల్ పాత్ర కూడా సినిమాకు ఎంతో ఆకర్షణగా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉంది. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. చాలా క్లీన్ ఎమోషన్ ఫ్యామిలీ చిత్రమిదని.. అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఇటీవల దర్శకుడు ఓ ఇంటర్వూలో తెలిపారు.