»A Private Travel Bus Caught Fire In Nalgonda One Person Died
Private travel bus: దగ్ధం..ఓ వ్యక్తి సజీవదహనం
ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు తెల్లవారుజామున హైదరాబాద్ వస్తుంది. ఆ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న వారందరూ ఎంచక్కా నిద్రపోతున్నారు. అంతే అదే క్రమంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందులోనే ఉండగా..అతను మంటల్లోనే కాలిపోయాడు.
A private travel bus caught fire in Nalgonda one person died
నల్గొండ(Nalgonda) జిల్లా మర్రిగూడ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు(private travel bus) ఈరోజు తెల్లవారుజామున దగ్ధమైంది. షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే సజీవ దహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మంటలు చెలరేగిన క్రమంలో అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగగా..నిద్రమత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు మాత్రం బస్సులోనే ఉన్నాడు. దీంతో అతన్ని మంటలు చుట్టుముట్టగా కొన్ని నిమిషాల్లోనే అగ్నికి అహుతయ్యాడు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో బస్సులోని ప్రయాణికుల సామాన్లు దగ్ధమయ్యాయి. బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.
ఆ క్రమంలో పలువురు ప్రయాణికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు(police) సమాచారం తెలుపడంతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతోపాటు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం నిజంగా షార్ట్ సర్య్కూట్ వల్లనే జరిగిందా లేదా ఎవరైనా కావాలనే నిప్పంటించారా లేదా ఎవరైనా ప్రయాణికుడు సిగరేట్ కాల్చి బస్సులోనే వేయడం వల్ల మంటలు వచ్చాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సులు విచ్చలవిడిగా అనేక మంది ప్రయాణికులను బస్సులు ఎక్కించుకుని బస్సులకు కనీసం కొంత సేపు రెస్ట్ ఇవ్వకుండా అనేక ట్రిప్పులు తిప్పడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు.