స్టార్ హీరో విజయ్ దళపతితో తనకు శత్రుత్వం ఉందని వస్తోన్న వార్తలపై అజిత్ స్పందించాడు. వాటిలో ఎలాంటి నిజం లేదన్నాడు. తామిద్దరి మధ్య కావాలని అపోహలు సృష్టిస్తున్నారని, దాని వల్ల అభిమానులు గొడవపడుతున్నారని చెప్పాడు. తాను ఎప్పుడూ విజయ్‌కి మంచి జరగాలని కోరుకుంటూనే ఉంటానని తెలిపాడు. అందువల్ల ఇలాంటి వార్తలు సృష్టించేవారు మౌనంగా ఉంటే బాగుంటుందన్నాడు.