W.G: యలమంచిలి మండలం కొంతేరు ZPHS 9వ తరగతి విద్యార్థి పెదపూడి అరుణ్ కుమార్ అండర్-17 బాలుర జావెలిన్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం డి. రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెదవేగిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అరుణ్ కుమార్ 42 మీటర్లు జావెలిన్ విసిరి ప్రథమ స్థానం సాధించాడు.