అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కిన యానిమల్ మూవీ ఈ శుక్రవారం విడుదలై సంచలన విజయం అందుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన రివ్యూను ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అది తెగ వైరల్ అవుతుంది.
Animal: బాలీవడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా యానిమల్. దీనిపై ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని రాశారు. ఈ నేపథ్యంలో వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తన రివ్యూను రాసి ట్విట్ చేశారు. మాములుగా ఆయన స్టైల్లో కాకుండా సామాన్యుడికి అర్థం అయ్యేలా రాశారు. ఆయన లేఖలో ఏం పేర్కొన్నారో చూద్దాం.
“యానిమల్(Animal) సినిమా మీద రాసిన చాలా రివ్యూలు చూసి, చదివిన తర్వాతే నేను సినిమా కి వెళ్ళాను .. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా సినిమాలు తీసిన తర్వాత నేను కేవలం ఒక ప్రేక్షకుడి గా మాత్రమే ఏ సినిమానీ చూడలేను … అందుకే ఈ సినిమాని వేరు వేరు కోణాల్లోచూడాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళాను. నైన్ అండ్ హాఫ్ వీక్స్(Nine and a Half Weeks) , ఫ్యాటల్ అట్రాక్షన్(Fatal Attraction), లోలిట , లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్ యాడ్రియన్ లిన్ ఒక ఇంటర్వ్యూ లో ఏమన్నాడంటే, సినిమా అన్నది ప్రేక్షకుడికి నచ్చిందా , నచ్చలేదా , అన్నంత సింపుల్ గా ఉండకూడదు రియల్లీ ఇంపాక్ట్ సినిమా అంటే ప్రేక్షకులు తీవ్రంగా డిస్కస్ చేసుకునేలా ఉండాలి అని, ఒక కొత్త తర్కానికి తెర తీయాలి అన్నారు. అదే సందేశం ఇవ్వాళ సందీప్ రెడ్డి వంగా నిరుపించాడు అని పేర్కొన్నారు.
ఈ సినిమా హిపోక్రసీ బట్టలిప్పదీసి పూర్తి నగ్నమైన నిజాయితీనీ చూపించాడు అని, ఎందుకంటె యానిమల్ అనేది ఒక సినిమా కాదు, ఒక సోషల్ స్టేట్మెంట్ అని పేర్కొన్నారు. నా ఉద్దేశ్యం లో ఈ సినిమా మూడున్నర గంటలు కాకుండా నాలుగున్నర గంటలున్నా తక్కువే. హీరో వెళ్లి బేస్ బాల్ బ్యాటో అలాంటిదేదో పట్టుకుని వస్తాడేమో అనుకుంటే మెషీన్ గన్‌తో రావటం థియేటర్లో ప్రేక్షకులను ఓ కుదుపుకుదిపేసిందని వెల్లడించారు. ప్రతీ సీన్ గురించి చాలా లోతుగా విశ్లేషించారు. రామ్ గోపాల్ వర్మ చేసిన పూర్తి రివ్యూ కోసం ఆర్జీవీ ట్వీట్‌ను ఓపెన్ చేయండి.