మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈడీకి కీలక సందేశాన్ని పంపించారు కవిత. తాను అనారోగ్య కారణాల వల్ల ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆమె అందులో పేర్కొన్నారు.
what is delhi liquor scam and what is kavitha role
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నేడు గురువారం (మార్చి 16) మధ్యాహ్నం గం.12.00 వరకు కూడా కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ ( investigation enforcement directorate) ఎదుట విచారణకు హాజరు కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఆమె పదకొండు గంటలకే ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సి ఉంది. కానీ హాజరు కావాల్సిన సమయం దాటినప్పటికీ ఢిల్లీలోని తన తండ్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు (K Chandrasekhar Rao) నివాసం నుండి బయటకు రాలేదు. కవిత, కేటీఆర్, హరీష్ రావు, ఇతర మహిళా మంత్రులు తదితరులు సుదీర్ఘంగా న్యాయ నిపుణులతో కలిసి చర్చించారు. అంతకుముందే ఎస్కార్ట్ వాహనం తన నివాసానికి వచ్చినప్పటికీ ఆమె మాత్రం బయటకు రాలేదు.
అనంతరం మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈడీకి కీలక సందేశాన్ని పంపించారు కవిత. తాను అనారోగ్య కారణాల వల్ల ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆమె అందులో పేర్కొన్నారు. అదే సమయంలో తన పిటిషన్ సుప్రీం కోర్టులో 24వ తేదీన విచారణ చేసి, తీర్పు చెప్పనున్నదని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాను ఇప్పటికిప్పుడు హాజరు కాలేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా, హఠాత్తుగా అనారోగ్య కారణాలు చెప్పడంతో ఈడీ ఆ సందేశాన్ని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. సహేతుకమైన కారణాలు ఉంటే పర్లేదు కానీ… అలాంటిది కనిపించక పోవడంతో ఈడీ విజ్ఞప్తిని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. అయితే సోమా భరత్ ఈడీ రిసెప్షన్ వద్ద ఈ వార్త రాసే సమయానికి వెయిట్ చేస్తున్నారు. అంటే ఈడీ ఏం చేస్తుందనే అంశం తెలియాల్సి ఉంది. ఢిల్లీలో కవిత విచారణకు హాజరు కాకపోవడం, ఈడీ తిరస్కరించడం… తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఆ తర్వాత కాసేపటికి కవితను తీసుకు రావడానికి వచ్చిన ఎస్కార్ట్ వెనక్కి వెళ్లాయి.
వారితో కలిసి విచారించే సమయానికి….
ఐదు రోజుల క్రితం కవితను సుదీర్ఘంగా విచారించింది ఈడీ. అప్పుడే ఇతర నిందితులు అరుణ్ రామచంద్ర పిళ్లై, మనీష్ సిసోడియాతో కలిసి విచారిస్తారని భావించారు. కానీ ఆ రోజు కవితను మాత్రమే విచారించారు. ఈ రోజు ముగ్గురిని కలిసి విచారించాలని ఈడీ భావించింది. కానీ అంతలోనే కవిత విచారణకు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. మిగతా నిందితులతో కలిసి కవితను ఈ రోజు సుదీర్గంగా విచారించవచ్చునని వార్తలు వచ్చాయి.