»Virat Kohli Will Score 110 Centuries Shoaib Akhtars Big Prediction
Shoaib Akhtar: విరాట్ కోహ్లీ సెంచరీలపై పాక్ మాజీ క్రికెటర్ కీలక జోస్యం
టీమ్ ఇండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్ లో 110 సెంచరీలు (110 Centuries) సాధిస్తాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Pakistan former cricketer Shoaib Akhtar) జోస్యం చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్ లలో ఫామ్ లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేసి సుదీర్ఘ సెంచరీ ఉత్కంఠకు తెర దించాడు.
టీమ్ ఇండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్ లో 110 సెంచరీలు (110 Centuries) సాధిస్తాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Pakistan former cricketer Shoaib Akhtar) జోస్యం చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్ లలో ఫామ్ లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేసి సుదీర్ఘ సెంచరీ ఉత్కంఠకు తెర దించాడు. మూడేళ్లుగా టెస్టుల్లో సెంచరీ చేయలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా 186 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. వన్డేల్లోను చాలా రోజులుగా సెంచరీ లేదు. ఇప్పుడు ఫామ్ లోకి రావడంతో తదుపరి మ్యాచ్ లోను అభిమానులు సెంచరీని ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడని, అయితే ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. గతంలో కెప్టెన్సీ కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడని, ఇప్పుడు ఆ ఒత్తిడి మాత్రం లేదని గుర్తు చేశారు. మానసికంగా ఇప్పుడు స్వేచ్చగా ఉన్నట్లు చెప్పాడు. తప్పకుండా మరింత ఫోకస్ పెట్టి మ్యాచ్ లు ఆడుతాడని అభిప్రాయపడ్డారు. అత్యధిక సెంచరీల రికార్డ్ ప్రస్తుతం సచిన్ టెండుల్కర్ ఖాతాలో ఉన్నాయని, కోహ్లీ ఆయనను అధిగమించడంతో పాటు 110 సెంచరీలు కూడా సాధిస్తాడని జోస్యం చెప్పారు. ఇక నుండి బీస్ట్ లా పరుగుల వేటతో ముందుకు సాగుతాడని అభిప్రాయపడ్డారు.
తన ఇంటర్నేషనల్ క్రికెట్ లో (International cricket) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) వికెట్ తీయడమే తనకు ఎంతో ఇష్టమైన సంఘటనగా తెలిపారు. కోల్ కతా వేదికగా జరిగిన భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లో తాను సచిన్ వికెట్ తీస్తానని ముందే, తన జట్టు సభ్యులకు చెప్పానని, అనూహ్యంగా తొలి బంతికే సచిన్ వికెట్ ను పడగొట్టానని, లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో ఆ వికెట్ తనకు జీవితంలో మరిచిపోలేని సంఘటన అన్నారు. అయితే సచిన్ ఔట్ కాగానే స్టేడియం మొత్తం ఖాళీ అయిందని గుర్తు చేసుకున్నారు.