»Heavy Rain Lashes Hyderabad And Some Districts Hailstorm
Hyderabadలో వర్షాలు.. జిల్లాలో వడగండ్లు, ఒక్కసారిగా మారిన వాతావరణం
Rains at Hyderabad:అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ (telangana) రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడుతుంది. హైదరాబాద్ (hyderabad) మహానగరంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.
Heavy rain lashes hyderabad and some districts hailstorm
Rains at Hyderabad:అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ (telangana) రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడుతుంది. హైదరాబాద్ (hyderabad) మహానగరంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. సిటీలో నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్ సుఖ్నగర్, మలక్ పేట, రాజేంద్ర నగర్, అత్తాపూర్లో వర్షం కురిసింది. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వడగండ్ల వాన పడింది.
హైదరాబాద్లో (hyderabad) ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం చిమ్మ చీకటి కమ్ముకుంది. గత కొద్ది రోజుల నుంచి ఎండలు దంచికొడుతుండగా.. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో హైదరాబాదీలు సంబరపడ్డారు. ఉరుములు, మెరుపులతో నగరం (city) హోరెత్తిస్తోంది. ఇటు పల్లెల్లో ఈ వర్షం రైతులకు నష్టం చేకూర్చనుంది. చేతికొచ్చిన పంట.. ఈ చెడగొట్టు వానలతో నష్టం కలిగించనుంది.
పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా అల్పపీడన ద్రోణివల్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. నాలుగురోజులపాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది.