»Delhi Excise Policy Case Kavitha Skips Ed Date Sends Documents Instead
Delhi Excise Policy Case:అనారోగ్యం కాదు.. అందుకే రావట్లేదు.. ముందస్తు బెయిల్ కు కవిత!?
ఢిల్లీ మద్యం కేసులో నేడు విచారణకు హాజరు కాలేనని భారత రాష్ట్ర సమితి నేత (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు (enforcement directorate) లేఖ రాశారు.
ఢిల్లీ మద్యం కేసులో (Delhi Excise Policy Case) నేడు విచారణకు హాజరు కాలేనని భారత రాష్ట్ర సమితి నేత (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు (enforcement directorate) లేఖ రాశారు. తనకు ఇచ్చిన నోటీసుల్లో (ED notieces) తనను కానీ లేదా తన ప్రతినిధిని కానీ పంపించాలని లేదని, అదే సమయంలో తాను భౌతికంగా హాజరు కావాలని లేదని, అందుకే తాను తన ప్రతినిధి ద్వారా వివరాలు పంపిస్తున్నట్లు ఈడీకి పంపిన సమాచారంలో పేర్కొన్నారు. సెక్షన్ 50(3) ప్రకారం తన ప్రతినిధిని పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు కవిత (MLC Kavitha) మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చల అనంతరం తన ప్రతినిధి సోమా భరత్ (Soma Bharat) ద్వారా డాక్యుమెంట్స్ పంపించారు. మంత్రులు కేటీ రామారావు (KT Rama Rao), హరీష్ రావులతో (Harish Rao) పాటు మహిళా మంత్రులు, ఎంపీలు కవితతో పాటు కేసీఆర్ నివాసంలో ఉన్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విచారణకు వెళ్లడంపై ఉత్కంఠ కనిపించింది. ఆ తర్వాత ఆమె ప్రతినిధిని పంపించారు.
ఈడీ కార్యాలయం (ED office) నుండి బయటకు వచ్చిన అనంతరం సోమా భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11 వ తేదీన కవితను ఈడీ అధికారులు విచారించారని, చట్ట ప్రకారం నడుచుకోలేదని చెప్పారు. చట్ట ప్రకారం పిల్లలను, మహిళలను ఇంటి వద్దనే విచారణ జరపాలన్నారు. అలాగే, మహిళలను సాయంత్రం ఆరు గంటల వరకు విచారించాలని, కానీ ఆ తర్వాత కూడా రాత్రి ఎనిమిది గంటల వరకు విచారించారన్నారు. కానీ అలా చేయలేదన్నారు. తద్వారా మొదటిసారి విచారించిన సమయంలో నిబంధనలను ఉల్లంఘించారన్నారు. నోటీసులు ఇవ్వకుండానే ఫోన్ ను సీజ్ చేశారన్నారు. కవిత తరఫున తాను హాజరై ఈడీకి అడగిన 12 రకాల డాక్యుమెంట్లను సమర్పించినట్లు చెప్పారు. బ్యాంకు స్టేట్ మెంట్ కూడా పంపించినట్లు తెలిపారు. కవిత అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేదని వార్తలు రావడంపై ఆయన స్పందించారు. అదేం లేదని, సుప్రీం కోర్టు 24వ తేదీన విచారణ జరిపిన అనంతరం ఈడీ ఎదుట కచ్చితంగా హాజరవుతారన్నారు. ఈ రోజు డాక్యుమెంట్స్ సమర్పించాక మళ్లీ ఎప్పుడు రావాలో ఈడీ చెప్పలేదన్నారు. కవిత పైన కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
సాక్షిగా మాత్రమే…
ఇప్పటి వరకు ఈడీ… కవిత నుండి సాక్షిగా మాత్రమే వాంగ్మూలం తీసుకుంటున్నారు. విచారణలో భాగంగా ఏవైనా ఆధారాలు దొరికితే మాత్రమే అక్యూజ్డ్ గా పేర్కొంటారు. కానీ ఆమె సాక్షిగా కూడా విచారణకు హాజరయ్యేందుకు వెనుకాడుతున్నారు. ఈడీ విచారణకు పిలిస్తే ధిక్కరించిన కేసు దాదాపు ఇదే అని నిపుణులు అంటున్నారు. కవిత కూడా ముందస్తు బెయిల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఉదయం నుండి చర్చలు.. హైడ్రామా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉదయం నుండి హైడ్రామా కనిపించింది. ఉదయం నుండి కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర రావు, ఎంపీలతో కలిసి న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. ఉదయం పది గంటలకు మీడియాతో మాట్లాడుతానని నిన్న చెప్పారు. కానీ మీడియా ముందుకు రాలేదు. పైగా ఈడీ కార్యాలయానికి విచారణ కోసం కూడా వెళ్లలేదు. ఉత్కంఠ మధ్య మధ్యాహ్నం గం.11.45 సమయానికి తన ప్రతినిధి సోమా భరత్ ను పంపించారు. సోమా భరత్ డాక్యుమెంట్స్ సమర్పించి, ఈడీ కార్యాలయం వద్ద వేచి చూస్తున్నారు.
హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద భద్రత
ఢిల్లీలో కవిత విచారణ మీద ఉత్కంఠ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కవితకు ఈడీ నోటీసులకు నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తలు కార్యాలయాన్ని ముట్టిడించే అవకాశాలు ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈడీ కార్యాలయాన్ని కూడా మూసివేశారు.