»Parliament Session Adjourned Due To Opposition Leaders Protest On Gautam Adani Scam
Adani Scamపై నాలుగో రోజు అదే సీన్.. ఆందోళనలతో దద్దరిల్లిన Parliament
ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నాయి. లక్షల కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేయాలని, జేపీసీ (JPC) వేయాలని కోరుతూ బుధవారం 18 ప్రతిపక్ష పార్టీలు ఈడీ కార్యాలయానికి కవాతు చేపట్టిన విషయం తెలిసిందే.
గౌతమ్ అదానీ (Gautam Adani Scam) కుంభకోణం పార్లమెంట్ సమావేశాల్లో (Parliament Session) ప్రకంపనలు సృష్టిస్తోంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నుంచి అదానీ కుంభకోణం (Gautam Adani Scam)పై విచారణ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు (Oppositon Parties) డిమాండ్ చేస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పార్లమెంట్ స్తంభించింది. విచారణ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఉభయసభల్లోనూ ఆందోళనలు చేపట్టారు. గురువారం కూడా సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సభ ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో రేపటికి వాయిదా పడ్డాయి.
కాగా ఇదే అంశంపై విపక్షాలు సభ లోపల, బయట ఆందోళనలు (Protest) చేపడుతున్నాయి. అయితే ప్రతిపక్షాల డిమాండ్ ను నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. కనీసం సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని వాయిదా తీర్మానాలు ఇస్తున్నా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla), రాజ్యసభ చైర్మన్ ధన్ కర్ పక్కకు తోసేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నాయి. లక్షల కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేయాలని, జేపీసీ (JPC) వేయాలని కోరుతూ బుధవారం 18 ప్రతిపక్ష పార్టీలు ఈడీ కార్యాలయానికి కవాతు చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి, సీబీఐ కేంద్ర కార్యాలయానికి ఊరేగింపుగా బయల్దేరారు. అయితే 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం కూడా అదే తీరున ఆందోళన చేశారు.
కాగా ఈ ఆందోళనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. ‘పగలు రాత్రీ లేకుండా ఇక్కడ నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తి… విదేశాలకు వెళ్లి మాత్రం తనకు మాట్లాడే స్వేచ్ఛ లేదని చెబుతారు. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధే ముంచేస్తున్నాడు. దేశానికి హానీ చేయాలని ప్రయత్నిస్తే మేం నిశ్శబ్దంగా ఉండబోం. లండన్ సెమినార్ లో మాట్లాడిన వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందే’ అని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.
వీరి ఆందోళనకు తోడు ఇటీవల లండన్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఎన్డీఏ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో పార్లమెంట్ స్తంభించింది. ఇరు పక్షాల ఆందోళనతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నాలుగో రోజు కూడా ఎలాంటి చర్చలు జరుగకుండా సభలు ముగిశాయి. అత్యంత విలువైన సభా సమయాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై పార్లమెంట్ సమావేశాలు చర్చలు జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తున్నారు.