»Plastic Rice In Ration Rice At Rudraram Karimnagar Telangana
Plastic Rice: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్..కాలిస్తే ముద్దలు
ఓ వ్యక్తి రేషన్ షాపుకి(ration shop) వెళ్లి బియ్యం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి వండి చూస్తే అవి ప్లాస్టిక్ బియ్యం(Plastic rice) అని తేలింది. అనుమానం వచ్చిన వాటిని కాల్చిన నేపథ్యంలో ప్లాస్టిక్ ముద్దవలె దగ్గరికి వచ్చిందని బాధిత గ్రామస్థుడు పేర్కొన్నాడు. ఈ సంఘటన తెలంగాణ(telangana)లోని కరీంనగర్ జిల్లా రుద్రారం గ్రామం(rudraram village)లో జరిగింది. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో అచ్చం ఇలాంటి ప్లాస్టిక్ బియ్యం ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రజలు ఇలాంటి బియ్యం సరఫరాపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓ వ్యక్తి రేషన్ షాపు(ration shop)కి వెళ్లి బియ్యం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి వండి చూస్తే అవి ప్లాస్టిక్ బియ్యం(Plastic rice) అని తేలింది. అయితే బియ్యాన్ని వండిన తర్వాత అనుమానం వచ్చి వాటిని కాల్చిన నేపథ్యంలో ప్లాస్టిక్ ముద్దవలె దగ్గరికి వచ్చిందని బాధిత గ్రామస్థుడు పేర్కొన్నాడు. ఈ సంఘటన ఎక్కడో కాదు. తెలంగాణ(telangana)లోని కరీంనగర్ జిల్లా రుద్రారం(rudraram village) గ్రామంలో చోటుచేసుకుంది. అంతేకాదు అతనితోపాటు మరికొంత మంది తీసుకున్న రేషన్ బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం(Plastic rice) వచ్చినట్లు తెలిసింది. ఇది తెలిసిన గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆ బియ్యం తిన్నవారి పరిస్థితి ఏంటని రేషన్ షాపు నిర్వహకుడిని నిలదీస్తున్నారు.
ఆ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం(rice)లోనే ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయా? లేదా రేషన్ షాప్ నిర్వహకులు ఆ బియ్యంను కల్తీ చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరికొంత మంది అయితే అసలు ఆ బియ్యాన్ని తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. తమకు అలాంటి రైస్ వద్దని అంటున్నారు.
ఇక్కడే కాదు మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం(Plastic rice) కలుపుతున్నారని తేలింది. గతంలో ఆదిలాబాద్ జిల్లా(adilabad district) ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి రైస్ సరఫరా అయినట్లు వెలుగులోకి వచ్చింది. జైనూరు మండలంలోని భూసిమెట్ట, ముక్కెరగూడ గ్రామాల్లో కల్తీ రేషన్ బియ్యాన్ని గుర్తించారు. రేషన్ బియ్యం వండుకున్న తర్వాత రంగు మారడంతోపాటు జిగురు జిగురుగా ఉందని ఆ గ్రామస్థులు తెలిపారు. ఆ తర్వాత అనుమానంతో బియ్యాన్ని కాల్చడంతో అవి ముద్దగా మారడంతో ప్లాస్టిక్ బియ్యమని గుర్తించినట్లు స్థానికులు చెప్పారు.
అయితే ఈ బియ్యాన్ని తిన్న పలువురు లబ్దిదారులు కడుపులో అసౌకర్యం, పొట్టలో పుండ్లు, విరేచనాలు వంటి ఫిర్యాదులు వచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సరైన లేబులింగ్ లేకుండా బలవర్థకమైన బియ్యం పంపిణీపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వీటని తినడం ద్వారా సికిల్-సెల్ అనీమియా, తలసేమియా వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు(doctors) హెచ్చరిస్తున్నారు.