Ed notice to magunta:వైసీపీ ఎంపీ మాగుంటకు నోటీసులు..18న విచారణకు హాజరుకావాలని ఆదేశం
Ed notice to magunta:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణను స్పీడప్ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకాని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతోపాటు సౌత్ గ్రూపులో కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి నోటీసు ఇచ్చింది.
Ed notice to magunta:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ (Ed) విచారణను స్పీడప్ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకాని కవితకు (kavitha) మరోసారి నోటీసులు ఇచ్చింది. సౌత్ గ్రూపులో (south group) కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి (magunta srinivasulu reddy) నోటీసు ఇచ్చింది. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది. ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి (raghava reddy) అరెస్టయ్యాడు. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీన రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటివరకు 11 మంది (11 members) అరెస్ట్ అయ్యారు. ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని సమీర్ మహేంద్ర (sameer mahendra) సెప్టెంబర్ 28వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ పీ శరత్ చంద్రా రెడ్డిని (sharath chandra reddy) నవంబర్ 11వ తేదీన, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీకి చెందిన బినొయ్ బాబును నవంబర్ 11న.. అభిషేక్ బోయినపల్లి (abhishek) నవంబర్ 13వ తేదీన అరెస్ట్ చేశారు. విజయ్ నాయర్ నవంబర్ 13వ తేదీన.. బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరాను (amith arora) నవంబర్ 29వ తేదీన.. ఫిబ్రవరి 8న గౌతమ్ మల్హోత్రా (gautham malhotra).. చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రాజేష్ జోషి (rajesh joshi)ను ఫిబ్రవరి 9వ తేదీన.. ఫిబ్రవరి 11వ తేదీన మాగుంట రాఘవ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు.
ఇప్పుడు కవిత (kavitha).. ఆ తర్వాత మాగుంట శ్రీనివాసుల రెడ్డికి (magunta srinivasulu reddy) నోటీసులు జారీచేశారు. కవిత (kavitha) అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. ఈ రోజు విచారణకు అందుకే రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ మాగుంట (magunta) విచారణకు హాజరవుతారో లేదో చూడాలీ.