YS Sharmila:తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై (KTR) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిట్లంలో పిట్ట కథలు చెప్పిన పిట్టల దొర కేసీఆర్ కొడుకా కేటీఆర్ (KTR) అంటూ ట్వీట్ స్టార్ట్ చేశారు. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు? అని అడిగారు. 33 ప్రాజెక్టులు కట్టి తెలంగాణ బీడు భూములకు నీళ్ళు పారించినందుకు తెలంగాణను YSR రోకలి బండతో కొట్టి చంపినట్టా? అని అడిగారు.
రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ పథకాలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు కొట్టి చంపినట్టా? అని నిలదీశారు. ఆరోగ్యశ్రీ, పక్కా ఇళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, సర్కార్ ఉద్యోగాల భర్తీ.. ఇవన్నీ చేయడంతో ప్రజలను కొట్టి చంపినట్లేనా? అని ప్రశ్నించారు. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపుతుంది “కసాయి రావే” అని.. సీఎం కేసీఆర్‌ను (CM KCR) ఉద్దేశించి ఇండైరెక్టుగా చెప్పారు.
మిగులు బడ్జెట్ గల రాష్ట్రాన్ని కుటుంబం కోసం నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసి చంపేసిన మాట నిజం కాదా? అన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను, రుణమాఫీ అని రైతులను చంపుతున్నది నిజం కాదా? అని అడిగారు. ఫీజులు చెల్లించక విద్యార్థులను మోసం చేయలేదా? పోడుపట్టాలు ఇస్తామని గిరిజన బిడ్డలను కొట్టి చంపుతుంది కసాయిరావే కదా? అని షర్మిల (YS Sharmila) విమర్శించారు.
ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుంటే.. తెలంగాణను (TELANGANA) దర్జాగా దోచుకుంటున్న దొంగలు మీరు అని షర్మిల (YS Sharmila) విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు కాజేసింది మీరు అని.. మీ అక్రమాలకు అడ్డొస్తే, ప్రశ్నిస్తే చావగొట్టేది మీరేనని షర్మిల (YS Sharmila) అన్నారు. తల్లి లాంటి తెలంగాణను చంపుతున్న కసాయి గూండాలు మీరేనని.. ఈసారి ఓటు కోసం కాలు బయట పెట్టి చూడు. అయ్య కొడుకులకు ఆ రోకలి బండే సమాధానం చెబుతుందని షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొర కొడుకా కేటీఆర్.. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు? 33 ప్రాజెక్టులు కట్టి తెలంగాణ బీడు భూములకు నీళ్ళు పారించినందుకు YSR తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపినట్టా? రుణమాఫీ,ఉచిత కరెంట్,సబ్సిడీ పథకాలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు 1/4