ATP: పాతకొత్తచెరువు-గుత్తి-జక్కలచెరువు సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఈ నెల 26న రెండు రైళ్లను రద్దు/దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. డోన్-గుత్తి-డోన్ ప్యాసింజర్ (77205/06) రద్దు చేయబడింది. గుంతకల్లు-హిందూపురం ప్యాసింజర్ (77213/14) గుత్తి మీదుగా కాకుండా వెంకటాంపల్లి, ఖాదర్పేట్ స్టేషన్ల మీదుగా మళ్లించారు.