• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

భారీ భూకంపం.. 600 మందికి పైగా మృతి

ఆగ్నేయ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. అలెప్పో, లటాకియా, హమా, టార్టస్ ప్రావిన్స్ ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో 600 మందికి పైగా మరణించారు. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలకూలాయి. దీంతో చాలా మంది తమ ప్రాణాలను నిద్రలోనే కోల్పోయారు. భూకంపం వల్ల సిరియాలో 245 మందికిపైగా చనిపోయారు. అదేవిధంగా టర్కీలోనూ 284 మందికిపైగా మరణించార...

February 6, 2023 / 02:44 PM IST

మూడో‘సారి’.. ఢిల్లీ మేయర్ ఎన్నికపై అదే ప్రతిష్టంభన

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై వివాదం సద్దుమణగడం లేదు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. మేయర్ పదవుల ఎన్నికకు తాజాగా సోమవారం మూడోసారి సమావేశం కాగా మళ్లీ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహంంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో ఈ పంచాయితీని తేల్చుకోవడానికి సిద్ధమైంది...

February 6, 2023 / 02:15 PM IST

చెప్పేవి గొప్పలు.. చేసేవీ శూన్యం: బడ్జెట్ కు ఈటల కొత్త భాష్యం

తెలంగాణ ప్రభుత్వ తీరు చెప్పేవి గొప్పలు.. చేసేవి శూన్యం మాదిరి ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు. 78 నుంచి 80 శాతం నిదులు ఖర్చు చేయలేదని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: బాహుబలి బడ్జెట్.. ఏ...

February 6, 2023 / 12:59 PM IST

గరం నూనెలో వేయించి ఎట్లుంది అంటే ఎలా: ఈటల

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బాహుబలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో మంత్రి కేటీఆర్ మాట్లాడి అందరినీ ఆకర్షించారు. తాజాగా బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈటల రాజేందర్ ను కలిశారు. చదవండి: బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత? క...

February 6, 2023 / 12:13 PM IST

బాహుబలి బడ్జెట్: ఏ శాఖకు ఎంత? కేటాయింపులు ఇలా..

ఎన్నికల ఏడాది కావడం.. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా.. అందరి మనన్నలు పొందే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీ కేటాయింపులు జరిపింది. గతంలో ఎన్నడూ లేనట్టు బాహుబలి బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాదాపు రూ.3 లక్షల కోట్లకు రాష్ట్ర బడ్జెట్ చేరింద...

February 6, 2023 / 11:40 AM IST

బాహుబలి బడ్జెట్: తెలంగాణ బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు

ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోంది అంటూ బడ్జెట్ ప్రసంగం చేశారు. మొత్తం బడ్జెట్ రూ.2,90,396 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు ఉండగా.. మూలధన వ్యయం రూ.2,11,685 కోట్లుగా మంత్రి తన ప్రసంగంలో తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: తెలంగా...

February 6, 2023 / 11:38 AM IST

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు బడ్జెట్

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బడ్జెట్ ప్రతులతో మంత్రి హరీశ్ రావు విచ్చేసి పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిస...

February 6, 2023 / 10:54 AM IST

నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యిందేమో: ఏపీ ఎమ్మెల్సీ

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని, ప్రభుత్వం తమపై నిఘా ఉంచిందని ఆరోపించారు. తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తన ఫోన్ కూడా నిఘాలో ఉందనుకుంటున్నట్లు మాజీ ప్రొటెం స్పీకర్, పీడీఎఫ్ ఎమ్...

February 6, 2023 / 09:22 AM IST

సీఎం జగన్ వలనే వివేకా హత్య కేసు విచారణ ఆలస్యం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆలస్యానికి కారణం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలిపాడు. ఆయన తలచుకుని ఉంటే హత్య కేసు పది రోజుల్లోనే తేలిపోయేదని స్పష్టం చేశాడు. తాను చెప్పిందే జరుగుతోందని.. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. కడప సెంట్రల్ జైల్లో సీబీఐ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో దస్తగిరి మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు క...

February 6, 2023 / 08:44 AM IST

జగన్ నాడు బాదుడే బాదుడు.. నేడు గుంజుడే గుంజుడు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు యామినీ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిన మాటలు.. సీఎంగా అతడు చేస్తున్న పరిపాలనను ఉదాహరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ బాదుడే బాదుడు అని విమర్శించాడని.. ఇప్పుడు సీఎంగా జగన్ గుంజుడే గుంజుడు కార్యక్రమం ప్రారంభించాడని ఎద్దేవా చేశారు. చదవండి: ఇవే నా చివరి ఎన్న...

February 6, 2023 / 08:44 AM IST

ఇవే నా చివరి ఎన్నికలు: మాజీ సీఎం సంచలన ప్రకటన

వయసు మీద పడడం.. ప్రస్తుత జుగుప్సకర రాజకీయాలు వంటి వాటితో ఆ సీనియర్ నాయకుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నిలిచి గెలవాలి కానీ.. డబ్బులతో రాజకీయం చేయడం మాజీ ముఖ్యమంత్రికి నచ్చడం లేదు. ప్రస్తుత రాజకీయాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన రాజకీయాలకు త్వరలో గుడ్ బై చెప్పనున్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారి పోటీ చేసి అనంతరం ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరమవుతానని ప్రకటించారు. ఆయనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,...

February 6, 2023 / 07:48 AM IST

‘అరేయ్ పాగల్’ అంటూ బాల్క సుమన్ పై కేసీఆర్ చిందులు

యువ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్భాషలాడాడు. సుమన్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిండు సభలో కేసీఆర్ ‘పాగల్’ అంటూ చిందులు తొక్కారు. అది కూడా తెలంగాణలో కాదు మహారాష్ట్రలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ శాసనసభ్యుడిని పట్టుకుని ‘పాగల్’ అనడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంట్లో పనోడి మాదిరి సీఎం కేసీఆర్ ఇంట్లో బాల్క సుమన్ మారాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళిత ...

February 6, 2023 / 07:21 AM IST

పొంగులేటితో భేటీ అయిన నాయకులపై వేటు

ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేత, మాజీ లోకసభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం పైన పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నది. పొంగులేటితో భేటీ అయిన 20 మంది వైరా నాయకుల పైన వేటు వేసింది బీఅర్ఎస్ అధిష్టానం. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొరియ రాజశేఖర్, వైరా పురపాలక చైర్మన్ జైపాల్ సహా ఇరవై మందిని పార్టీ నుండి బహిష్కరించింది. పార్టీ అధిష్టానం పైన పొంగులేటి ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్ట...

February 5, 2023 / 10:06 PM IST

విజయ్-పరశురాం కాంబోలో మరో మూవీ ఫిక్స్

  గత కొన్ని రోజులుగా గీత గోవిందం మూవీ కాంబో మళ్లీ రిపీట్ కానుందని వస్తున్న వార్తలపై ఈరోజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ ఓ క్లారిటీ ఇచ్చింది. పరశురాం-విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ కాంబోలో మూవీ చేయనున్నట్లు ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ ప్రకటించింది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఆ ఫోటోలో విజయ్, దిల్ రాజు, డైరెక్టర్ పరుశురాం నవ్వుత...

February 5, 2023 / 09:39 PM IST

రాందేవ్ బాబాపై కేసు నమోదు

యోగా గురువు రాందేవ్ బాబాపై కేసు నమోదైంది. రాజస్థాన్‌లోని చైహాటాన్ ప్రాంతానికి చెందిన పఠాయి ఖాన్ అనే వ్యక్తి రాందేవ్ బాబాపై ఫిర్యాదు చేశాడు. బర్మార్ ప్రాంతంలో సాధువుల సమావేశంలో రాందేవ్ ముస్లింల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ బాబా మాట్లాడుతూ ముస్లింలు విద్వేషం వ్యాప్తి చేస్తున్నారని చెబుతూనే హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాందేవ్ బాబాపై ఫిర్యాదు ...

February 5, 2023 / 09:29 PM IST