»Center Alerts States And Union Territories On Corona Rising Again
CORONA ALERT: మళ్లీ కరోనా టెన్షన్..ఆ రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు(Corona New Cases) అధికంగా నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా(Corona)తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలిపింది.
తగ్గిపోయిందనుకున్న కరోనా(Corona) మళ్లీ తన పంజా విసురుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల(Corona Cases) సంఖ్య రోజురోజుకూ మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు(Corona New Cases) అధికంగా నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా(Corona)తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలిపింది.
ఇన్ఫ్లుయెంజా వ్యాధులు(Diseases) ఎక్కువగా ప్రభలుతున్నాయని, అందుకే ప్రజలు గుంపులుగా ఉండే పరిస్థితిని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, రోగులు కచ్చితంగా మాస్కులు(Masks) ధరించాలని తెలిపింది. కరోనా పరీక్షల(Corona Tests) సంఖ్యను పెంచి, కరోనా లక్షణాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.