మార్చి 28, 29 తేదీల్లో విశాఖ(Visakhapatnam)లో జరగనున్న జీ-20 సమ్మిట్ వర్కింగ్ గ్రూప్ కమిటీ భేటీ త్వరలో జరగనున్న నేపథ్యంలో గ్లోబల్ ఈవెంట్‌కు అధికారులు తుది ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఆర్కే బీచ్ లో జీ20 సన్నాహక మరథాన్(Marathon) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు గుడివాడ అమర్ నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజనిలు హాజరై ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీచ్ లో పారా సైలింగ్ పోటీలు ఏర్పాటు చేయగా..దానిలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పారా సైలింగ్ కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత పక్కకు ఒరిగింది. ఆ క్రమంలో పక్కనున్న వారు నియంత్రించి పట్టుకున్నారు.
విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయంగా గుర్తించేలా నగరాన్ని ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జి-20 సదస్సుకు 40 దేశాల నుంచి 200 మంది విదేశీ ప్రతినిధులు(delegates from 40 countries) హాజరుకానున్నారు. వీరితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానుండగా, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతి, ప్రయాణ ఏర్పాట్లను చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
చదవండి: ISRO: LVM3-M3 వన్ వెబ్ ఇండియా-2 మిషన్ ప్రయోగం సక్సెస్
ప్రతిష్టాత్మకమైన జీ 20 సదస్సులో వైజాగ్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పుడు విశాఖపట్నం(Visakhapatnam)లో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా బీచ్ అందంగా, అద్దంలా మెరిసిపోతూ ఆకర్షణీయమైన విద్యుద్దీపాలతో ఉంటుంది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ప్రజలను కూడా భాగస్వాములను చేసేందుకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీ-20 సదస్సులో వేలాది మంది ఆర్థిక మంత్రులు, విదేశాంగ మంత్రులు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పాల్గొంటారు.
చదవండి: ISRO: LVM3-M3 వన్ వెబ్ ఇండియా-2 మిషన్ ప్రయోగం సక్సెస్
జీ-20 సదస్సు నిర్వహణకు మొత్తం 15 కమిటీలు వేయగా.. నోడల్ అధికారిగా జేసీ విశ్వనాథన్‌ను నియమించారు. నగరంలోని స్టార్ హోటళ్లలో 703 గదులను అతిథుల కోసం రిజర్వ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అతిథులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులు బస చేసే హోటళ్లు, విమానాశ్రయాల్లో 24/7 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జి-20 సదస్సు తొలిరోజు అంటే 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి(jagan mohan reddy) నగరానికి చేరుకుంటారు. అలాగే రాష్ట్ర స్థాయి మంత్రులు, కార్యదర్శులు, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులకు అవసరమైన ఏర్పాట్లను చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు.
గ్రేటర్ విశాఖ నగరానికి అరుదైన గౌరవం. జి-20 అధ్యక్షుడిగా భారత్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, ఏడాది పొడవునా వివిధ ప్రాంతాల్లో సదస్సులు, వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలపై 200 సదస్సులు నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్(ap) నుంచి మహా విశాఖనగరాన్ని కేంద్రం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 28, 29, 30 తేదీల్లో విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఆర్థిక రంగం, వ్యవసాయం, పర్యావరణం, విద్య, వైద్యం తదితర అంశాలపై 37 సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారులు ఇప్పటికే వెల్లడించారు.
చదవండి: ISRO: LVM3-M3 వన్ వెబ్ ఇండియా-2 మిషన్ ప్రయోగం సక్సెస్

