AP: మాజీమంత్రి అంబటి రాంబాబు కామెంట్స్‌పై జనసేన పార్టీ సీరియస్ అయింది. అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ శ్రేణులు, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి బజారు రౌడీలా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. సమాజంలో అశాంతిని రేకెత్తించేలా మాట్లాడుతున్న అంబటిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

