MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కర్నే నాగరాజు శనివారం తన మద్దతు దారులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం వచ్చే నాయకుల మాటలు నమ్మవద్దని, తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. నిత్యం ప్రజల్లో ఉండే తనకు ప్రజల మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.

