SRD: అమీన్పూర్ మండల పరిధిలోని బంధం కొమ్ము గ్రామంలో మినీ మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం జాతర ముగింపుకు చేరుకోవడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

