WGL: ప్రజా గాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకొని అమరవీరుల స్తూపం వద్ద ఇవాళ కోవత్తులతో ర్యాలీ నిర్వహించి గద్దర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవన్న పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలను చైతన్య పరిచిన గొప్ప నాయకుడు గద్దర్ అని అన్నారు. గద్దర్ జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాలో చేర్చాలని ప్రభుత్వని కోరారు.

