ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల డాక్టర్ దత్తాత్రేయుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన చిరంజీవి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

