»Indias First Frozen Lake Marathon At Pangong Tso On Feb 20th
Frozen Lake Marathon భారత కిరీటంపై సాహసం.. దేశంలోనే తొలిసారి
హిమాలయాల (Himalayas) మంచు కొండల్లో కొలువైన అందమైన ప్రదేశం. ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా నిలిచే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో గిన్నీస్ రికార్డు బదలయ్యేలా ఓ క్రీడా సంబురానికి వేదిక కానుంది. ప్రస్తుతం చలికాలంలో మంచుగడ్డగా మారిన సరస్సులో 75 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు (Athletes) దూసుకెళ్లనున్నారు.
సముద్రానికి 13,862 అడుగుల ఎత్తు.. 700 చదరపు కిలోమీటర్లు అతి పెద్ద సరస్సు. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత. భారతదేశం చైనా సరిహద్దులో ఉన్న ప్రాంతం. హిమాలయాల (Himalayas) మంచు కొండల్లో కొలువైన అందమైన ప్రదేశం. ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా నిలిచే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో గిన్నీస్ రికార్డు బదలయ్యేలా ఓ క్రీడా సంబురానికి వేదిక కానుంది. ప్రస్తుతం చలికాలంలో మంచుగడ్డగా మారిన సరస్సులో 75 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు (Athletes) దూసుకెళ్లనున్నారు. మారథాన్ (Marathon)లలోనే ప్రత్యేకమైన ఈ మారథాన్ దేశంలో తొలిసారిగా జరుగనుంది. ఈ నెల 20వ తేదీన లద్దాఖ్ (Ladakh) వేదికగా ఈ మారథాన్ ప్రారంభం కానుంది. ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలో కూడిన ఈ మారథాన్ వివరాలు తెలుసుకోండి.
ప్రపంచంలో ఎత్తయిన గడ్డకట్టిన ఉప్పునీటి సరస్సు లద్దాఖ్ లోని పాంగాంగ్ సరోవరం (Pangong Tso). సముద్రానికి అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఈ సరస్సు వద్ద చలికాలంలో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సరస్సు మొత్తం గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. మొత్తం మంచుతో నిండి ఉంటుంది. ఈ గడ్డ కట్టిన సరస్సుపైన ఫ్రోజెన్ లేక్ మారథాన్ (Frozen Lake Marathon) నిర్వహించనున్నారు. ఈ నెల 20న జరుగనున్న మారథాన్ లో మొత్తం 70 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు పాల్గొననున్నారు. భారతదేశం (India)లో ఇలాంటి క్రీడా ఉత్సవం జరుగడం ఇదే తొలిసారి. భారత సైన్యంతో పాటు ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ-ITBP) బృందం కూడా ఈ కార్యక్రమాంలో భాగమైంది. 21 కిలో మీటర్ల ఈ మారథాన్ లుకుంగ్ అనే ప్రాంతం నుంచి మొదలై మాన్ గ్రామం వరకు కొనసాగుతుంది.
వాతావరణ మార్పులపై ప్రపంచం దృష్టికి తీసుకెళాలనే ఉద్దేశంతో ఈ మారథాన్ కు ‘లాస్ట్ రన్ (Last Run)’ అని నామకరణం చేశారు. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు లేహ్ జిల్లా అభివృద్ధి అధికారి శ్రీకాంత్ బాల సాహెబ్ సుసె తెలిపారు. అందులో భాగమే ఈ మారథాన్ అని పేర్కొన్నారు. ఈ మారథాన్ తో పాంగాంగ్ సరస్సుకు పర్యాటకుల సందర్శన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మారథాన్ లో 50 మంది అథ్లెట్లు విదేశాలకు చెందిన వారు కాగా, 25 మంది మన దేశపు అథ్లెట్లు ఉన్నారు. ఈ అథ్లెట్లను ముందుగా వైద్య పరీక్షలు చేసి పటిష్టంగా ఉంటేనే మారథాన్ కు అనుమతి ఇస్తారు. అన్నీ పరీక్షల్లో అర్హత సాధిస్తేనే మారథాన్ లో ఆ అథ్లెట్లు పాల్గొననున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయని సమాచారం.
జమ్మూ కశ్మీర్ లో దాదాపు 75 శాతం మొత్తం కొండ ప్రాంతం. అందులో మంచుతో నిండిన ప్రదేశమే అత్యధికం. భారతదేశానికి రక్షణగా ఉన్న హిమాలయ పర్వతాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడడంతో కశ్మీర్ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.