Vidyut Jammwal :బట్టల్లేకుండా హిమాలయాల్లో తిరుగుతున్న స్టార్ హీరో
విద్యుత్ జమ్వాల్ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. ప్రకృతికి దగ్గరగా, విద్యుత్ జమ్వాల్ శరీరం మీద నూలు పోగు లేకుండా కనిపించాడు.
Vidyut Jammwal : విద్యుత్ జమ్వాల్ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. ప్రకృతికి దగ్గరగా, విద్యుత్ జమ్వాల్ శరీరం మీద నూలు పోగు లేకుండా కనిపించాడు. ప్రకృతిలో సహజంగా జీవించేందుకు ప్రతి ఏడాదికోసారి ఇలాగే జీవిస్తున్నట్లు తెలిపారు. కాస్త హిమాలయాల్లో గడపడానికి విద్యుత్ జమ్వాల్ అక్కడే ఉన్నాడని అర్థమవుతోంది. విద్యుత్ జమ్వాల్ హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. తెలుగులో శక్తి, బిల్లా 2, ఊసరవెల్లి చిత్రాల్లో నటించారు. మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఆయన నిష్ణాతుడు. ఇంతకీ సీన్ బాగానే ఉంది కానీ ఇంత చలిలో బట్టలు లేకుండా ఎందుకు ఉన్నాడు బహుశా జీవితంపై విరక్తి చెందిదా ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అని నెటిజన్లు అంటున్నారు.
విద్యుత్ జమ్వాల్ హిమాలయాల్లో యోగిలా కనిపించాడు. అతను పోస్ట్ చేసిన ఫోటోలలో, అతను బట్టలు లేకుండా కూర్చున్నాడు. ప్రకృతిలో వంటలు, సూర్య నమస్కారాలు చేయడం కనిపించాయి. తాను భగవంతుడి ఆవాసంలో ఉన్నానంటూ… ఏటా 7-10 రోజులు హిమాలయాల్లో గడపడం తన జీవితంలో భాగమైపోయిందని విద్యుత్ జమ్వాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. విద్యుత్ జమ్వాల్, ఆదిత్య దత్ కలిసి ‘క్రాక్’ (KRACK MOVIE) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 23, 2024న విడుదల కానుంది.