Nizamabad: సర్కార్ ఫ్రీ అంది.. బస్సెక్కితే టికెట్ కొట్టారు.. మహిళల ఆవేదన
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద బస్ ఎక్కిన ప్రతి మహిళ ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
Nizamabad: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద బస్ ఎక్కిన ప్రతి మహిళ ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది. కానీ నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ చేసిన ఓ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టాడు. ఉచిత బస్సు సౌకర్యం ఉందని చెప్పినా కండక్టర్ వినలేదు. ఈ క్రమంలో కండక్టర్ వ్యవహారాన్ని బాధితులు వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. వెంటనే.. కండక్టర్ ను విధుల నుంచి ఆర్.ఎం. జాని రెడ్డి తప్పించారు. బోధన్ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న నర్సింహులుగా గుర్తించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం శనివారం సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రారంభించారు. ఇప్పటికే.. మహాలక్ష్మి పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా తమకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు తెలంగాణ రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే వారం రోజుల పాటు ఎలాంటి ఐడీ కార్డు చూపకుండా వెళ్లిపోవచ్చని సీఎం వెల్లడించారు.