»Celebrity Cricket League Schedule And Teams Details
Celebrity Cricket League సెలబ్రిటీల క్రికెట్ కు వేళాయే.. షెడ్యూల్ ఇదే
ఈ లీగ్ కు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారిలో పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద వాళ్లు సీసీఎల్ కు దూరంగా ఉంటారు. అందుకే సీసీఎల్ గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. బాలీవుడ్, కోలీవుడ్ తదితర సినీ పరిశ్రమలో పెద్ద స్టార్లు కూడా బరిలోకి దిగుతారు.
క్రికెట్ కు ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రికెట్ వేరే లెవల్. అందులో భారత మ్యాచ్ లంటే ఇక ప్రేక్షకులకు పండగే. అయితే అదే మన సినిమా నటులు ఆడితే అభిమానులకు పూనకాలే. క్రికెట్ అన్ని వర్గాలకు విస్తరిస్తున్నది. అందులో భాగమే సెలబ్రిటీలు కూడా క్రీడాభిమానులే. వాళ్లు కూడా బ్యాట్, బంతి పట్టనున్నారు. అన్ని సినీ పరిశ్రమకు చెందిన వారందరూ కలిసి ఓ టోర్నమెంట్ ఆడుతారు. దాని పేరే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) Celebrity Cricket League. ఈ ఏడాది జరుగాల్సిన సీసీఎల్ (CCL) షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 18వ తేదీ నుంచి మ్యాచ్ లు జరుగనున్నాయి. జట్లు, మ్యాచ్ ల వివరాలు ఇలా ఉన్నాయి.
అయితే ఈ లీగ్ కు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారిలో పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద వాళ్లు సీసీఎల్ కు దూరంగా ఉంటారు. అందుకే సీసీఎల్ గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. బాలీవుడ్, కోలీవుడ్ తదితర సినీ పరిశ్రమలో పెద్ద స్టార్లు కూడా బరిలోకి దిగుతారు. సల్మాన్ ఖాన్, మోహన్ లాల్, సుదీప్, బోనీ కపూర్ వంటి వారు కూడా ఈ మ్యాచ్ ల్లో ఆడుతున్నారు. ఈ లీగ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అందుకే అక్కడ ఆ ఆటకు క్రేజ్ ఎక్కువ.
ఇక తన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన జట్టు తెలుగు వారియర్స్. యువ నటుడు అక్కినేని అఖిల్ సారథ్యంలో మన సినీ పరిశ్రమకు చెందిన వారు బరిలోకి దిగనున్నారు. సచిన్ జోషి యజమానిగా ఉండగా దగ్గుబాటి వెంకటేశ్ సహ యజమానిగా, మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. యువ నటులు సాయిధరమ్ తేజ్, నిఖిల్ సిద్ధార్థ్, సుశాంత్, ప్రిన్స్, తరుణ్, సచిన్ జోషి, అశ్విన్ బాబు తదితరులు జట్టులో ఉన్నారు. జట్టులో మార్పులు చేర్పులు జరగవచ్చారు. నందమూరి తారకరత్న కూడా జట్టులో ఉన్నాడు. అయితే అతడు గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో ఎవరో వస్తారో తెలియాల్సి ఉంది. మిగతా ఆటగాళ్ల వివరాలు తెలియాల్సి ఉంది.
సీసీఎల్ వివరాలు
– బరిలోకి మొత్తం 8 జట్లు
– మొత్తం 19 మ్యాచ్ లు
– మొత్తం ఆటగాళ్లు 120 మంది
జట్లు, కెప్టెన్లు తెలుగు వారియర్స్ (Telugu Warriors) జట్టుకు కెప్టెన్ అక్కినేని అఖిల్. వెంకటేశ్ సహ యజమానిగా వ్యవరిస్తుండగా సచిన్ జోషి యజమాని. ముంబై హీరోస్ (Bollywood) జట్టుకు కెప్టెన్ రితేశ్ దేశ్ ముఖ్. బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్ చెన్నై రైనోస్ (కోలీవుడ్) జట్టుకు కెప్టెన్ ఆర్య. భోజ్ పురి దబాంగ్స్ జట్టుకు కెప్టెన్ మనోజ్ తివారి కేరళ స్ట్రైకర్స్ జట్టుకు కెప్టెన్ కుంచాకో బోపన్. అగ్ర నటుడు మోహన్ లాల్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. బెంగాల్ టైగర్స్ జట్టుకు కెప్టెన్ జిసుసేన్ గుప్తా. ఈ జట్టుకు బోనీ కపూర్ యజమాని. కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకు కెప్టెన్ సుదీప్ పంజాబ్ దె షేర్ జట్టు కు కెప్టెన్ సోనూసూద్
మ్యాచ్ ప్రాంతాలు
– ఈనెల 18వ తేదీ నుంచి మ్యాచ్ లు జరుగనున్నాయి. రాయ్ పూర్, బెంగళూరు, జోధ్ పూర్, త్రివేండ్రం, జైపూర్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
– మార్చి 18, 19న సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో జరుగనున్నాయి.