హీరో వెంకటేష్ ద్వితీయ కుమార్తె వాహిని నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో పెళ్లి ఖాయమైన నేపథ్యంలో నిన్న నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు.
Venkatesh: విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. ఆయన రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్ధం బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేష్ రెండవ కూమార్తె వాహిని వివాహం జరగనుంది. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. ఈ ఎంగెజ్మెంట్ వేడుక కొద్ది మంది సమక్షంలో జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీకి చెందిన తక్కువ మంది ప్రముఖుల సమక్షంలో ఎంగెజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. చీరంజీవి, మహేశ్‌బాబు, నాగచైతన్య ఈ వేడుకకు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెంకటేశ్, నీరజ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. పెద్ద కుమార్తెకి 2019లోనే వివాహం జరిగింది. ప్రస్తుతం ఈమె విదేశాల్లో ఉంటుంది. బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ ‘సైంధవ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం శైలేశ్ కొలను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్నది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.