నాలుగు పదుల వయసు దాటగానే వాకింగ్ చేయాలంటేనే చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ 80 ఏళ్ల వయసులో ఓ మహిళ శారీ, షూస్ ధరించి ఏకంగా ముంబయి మారథాన్లో పరిగెట్టారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్లో 55,000 మందికి పైగా పాల్గొనగా ఓ బామ్మ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. మారథాన్లో బామ్మ చలాకీగా పాలుపంచుకోవడం అందరిలో స్ఫూర్తి నింపింది. ఆమె మనవరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ బామ్మ మారథాన్లో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు యువతరానికి బామ్మ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.