ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించే దుర్గం చెరువు రన్ – 2023 భాగంగా పోలీసుల నగరంలో సీటి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు మారథాన్ జరగనుంది. మాదాపూర్, రాయదుర్గం…ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించే దుర్గం చెరువు రన్ – 2023 భాగంగా.. పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు మారథాన్ జరగనుంది. మాదాపూర్, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్నారు. ఈవెంట్లో 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు మరియు 5 కిలోమీటర్ల పరుగు ఉన్నాయి. రన్నింగ్ ఈవెంట్లో దాదాపు 4,500 మంది రన్నర్లు పాల్గొంటారు. ఇతర సహాయక సిబ్బంది దాదాపు 350 నుంచి 400 మంది నిర్వాహకులు, వాలంటీర్లు ఉంటారు. ఈ కార్యక్రమంలో వీఐపీలు కూడా పాల్గొంటారని భావిస్తున్నారు.