GDWL: అమావాస్య పుణ్యదినాన గద్వాల ఆరాధ్య దైవం శ్రీ జమ్ములమ్మ అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా దర్శనమిచ్చారు అని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని తెల్లవారుజామునే కృష్ణా నదీ జలాలతో అమ్మవారికి మంగళస్నానాలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి, ధూపదీప నైవేద్యాలతో మహా మంగళ హారతి సమర్పించారు.