SRD: జహీరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరం కానున్నాయి. గత ఆరేళ్ల తర్వాత మున్సిపల్ పోరుకు సిద్ధమైంది. పట్టణంలో 37 వార్డులు, వాటి రిజర్వేషన్లు ప్రకటించారు. అయితే మున్సిపల్ ఛైర్మన్ పదవి BC జనరల్‌కు కేటాయించారు. పట్టణంలోని 11, 12, 15, 17, 25, 28,36 వార్డులు BC జనరల్ కేటాయించారు. దీంతో ఈ వార్డుల్లో కౌన్సిలర్‌గా పోటీ చేస్తే చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది.