ప్రకాశం: పెద్దారవీడు మండలం గుండంచర్ల సమీపంలో వెలసిన శ్రీవేణుతల కాటమరాజు గంగ భవాని దేవస్థాన కమిటీ సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. వచ్చే నెలలో జరగనున్న తిరుణాల ఏర్పాట్ల గురించి చర్చించారు. ప్రతి ఏటా లక్షా 50 వేలకు పైగా భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరిన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టినట్లు కమిటీ అధ్యక్షులు గుమ్మ గంగరాజు తెలిపారు.