CM Jagan : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం… రూటు మార్చిన సీఎం జగన్..!
CM Jagan : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం సీఎం జగన్ పై బాగా ఎక్కువగా పడిందనే చెప్పాలి. ఈ ప్రభావం ఆయన ఈ రోజు దెందులూరు సభలో స్పష్టంగా కనపడుతోంది. ఇంతకీ మ్యాటరేంటంటే.... సీఎం జగన్ ఈ రోజు దెందులూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం సీఎం జగన్ పై బాగా ఎక్కువగా పడిందనే చెప్పాలి. ఈ ప్రభావం ఆయన ఈ రోజు దెందులూరు సభలో స్పష్టంగా కనపడుతోంది. ఇంతకీ మ్యాటరేంటంటే…. సీఎం జగన్ ఈ రోజు దెందులూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ జగన్…. వైయస్ఆర్ ఆసరా మూడో విడత నిధులు విడుదల చశారు. రూ.6,419.89 కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లోకి జగన్ జమ చేశారు.
మహిళలకు 50 శాతం నామినేట్ పోస్టులు ఇవ్వాలని చట్టం చేశామని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా కూడా మహిళలను ఆదుకుంటున్నామని తెలిపారు. మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబులాగా తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని జగన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగన్ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. జగన్ గతంలో చేసిన ప్రసంగాల కంటే ఈ ప్రసంగం వేరుగా ఉంది. గతంలో అనేక సందర్భాల్లో తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి జగన్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేవారు. టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేస్తూ కౌంటర్ ఎటాక్ చేసేవారు. దుష్టచతుష్టయం అంటూ విమర్శలు గుప్పించే వారు. దెందులూరు సభలో మాత్రం తమ ప్రభుత్వం మహిళలకు ఏం చేస్తుందనే విషయంపైనే పూర్తిగా ఫోకస్ చేశారు. ప్రతిపక్షాల పై విమర్శలు చేడయం వల్ల.. ఉపయోగం లేదని.. తమ ప్రభుత్వం పై ఫోకస్ పెట్టడం ముఖ్యమని ఆయన భావించినట్లు తెలుస్తోంది. అందుకే… ఆయన ఈ సారి ప్రతిపక్షాల పై విమర్శలు చేయకుండా… కేవలం తమ ప్రభుత్వం చేస్తున్న వాటి గురించే ఆయన మాట్లాడటం విశేషం.