»Telugu Warriors Is The Winner Of Celebrity Cricket League 2023 Fourth Time
Celebrity Cricket League 2023: నాలుగోసారి విజేతగా తెలుగు వారియర్స్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)2023 చాంపియన్ షిప్ ను తెలుగు వారియర్స్(Telugu Warriors) నాలుగో సారి గెల్చుకుని రికార్డు సృష్టించింది. నిన్న విశాఖలో జరిగిన ఫైనల్ మ్యాచులో భోజ్‌పురి దబాంగ్స్(Bojpuri Dabanggs)పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తెలుగు వారియర్స్… సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023లో(Celebrity Cricket League 2023) గర్వించదగిన ఛాంపియన్లుగా మరోసారి నిలిచారు. ఇప్పటికే మూడుసార్లు ఛాంపియన్ షిప్ గెల్చుకున్న తెలుగు వారియర్స్(Telugu Warriors).. భోజ్‌పురి దబాంగ్స్(Bojpuri Dabanggs) జట్టును ఓడించి నాల్గోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచులో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని(Telugu Warriors) అద్భుతమైన అర్ధశతకంతో ముందుండి నడిపించాడు. ఈ నేపథ్యంలో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
తొలుత టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భోజ్‌పురి(Bojpuri Dabanggs) తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ అఖిల్ (67) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 104 రన్స్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన భోజ్‌పురి 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. 58 పరుగుల లక్ష్యంలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన తెలుగు వారియర్స్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించడమే కాకుండా CCL టోర్నీలో నాలుగో టైటిల్ ను దక్కించుకుంది.
సుమారు మూడేళ్ల తర్వాత జరిగిన CCL-2023లో ఈ ఏడాది మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. తెలుగు వారియర్స్, ముంబై హీరోస్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్‌పురి దబాంగ్స్, పంజాబ్ డి షేర్లు.
2011లో ఐపీఎల్ స్ఫూర్తితో సీసీఎల్ తొలి మ్యాచ్ జరిగింది. అప్పుడు కేవలం నాలుగు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. 2019 వరకు, క్రీడా, సినీ అభిమానులను ఆకట్టుకున్న CCL కోవిడ్ కారణంగా మూడేళ్లపాటు వాయిదా పడింది.
ఇప్పటి వరకు జరిగిన సీసీఎల్ టోర్నీల్లో తెలుగు వారియర్స్ అత్యధికంగా మూడు (2015, 2016, 2017) టైటిళ్లను గెలుచుకుంది. తాజా టోర్నీ (2023) నాలుగో టైటిల్.
భోజ్‌పురి దబాంగ్స్ తొలిసారిగా CCL ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్లో భోజ్‌పురి ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.
ఈ టోర్నీ (2023)లో మొత్తం 320 సిక్సర్లు నమోదయ్యాయి.
సీసీఎల్ చరిత్రలో కర్ణాటక బుల్డోజర్స్, చెన్నై రైనోస్లు రెండుసార్లు గెలుపొందగా, ముంబై హీరోస్ ఒకసారి టైటిల్ గెలుచుకున్నాయి.