»Rahul Gandhi Said Modi Afraid Of Our Speech After Next Parlament Session
Rahul Gandhi: నా తర్వాత ప్రసంగం గురించి మోదీ భయపడుతున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) తన తదుపరి ప్రసంగానికి భయపడి అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఆయన కళ్లలో భయం కనిపించిందని, అందుకే తనను పార్లమెంట్లో మాట్లాడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యాన్ని తాను కోరినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
అనర్హత లేదా జైలు శిక్షలకు తాను భయపడేది లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పష్టం చేశారు. తనని శాశ్వతంగా అనర్హులుగా ప్రకటించినా కూడా తన పని తాను చేసుకుంటూ పోతానని వెల్లడించారు. పార్లమెంటు లోపల ఉన్నానా లేదా అన్నది ముఖ్యం కాదని ఈ సందర్భంగా అన్నారు. దేశం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని అన్నారు. ఈ క్రమంలో దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరోవైపు ప్రశ్నించే వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ(pm narendra modi)ని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే తన ప్రశ్న మాత్రం ఒక్కటేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అసలు అదానీ(adani) కంపెనీ అయిన షేల్ సంస్థకు(shell company)రూ.20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిల దీశారు. అదానీ గురించి తాను ఒకే ఒక్క ప్రశ్న అడిగానని..తర్వాత కూడా ప్రశ్నలు అడుగుతూనే ఉంటానని వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
కానీ అదానీని(adani).. ప్రధాని మోదీ ఎందుకు రక్షిస్తున్నారని అనేక మంది అడుగుతున్నారని దానికి సమాధానం చెప్పాలని రాహుల్(Rahul) అన్నారు. మరోవైపు నిబంధనలు మార్చి అనేక ఎయిర్ పోర్టులు అదానీకి అప్పగించారని ఆరోపించారు. అదానీ, మోదీ స్నేహం గురించే పార్లమెంటులో మాట్లాడానని పేర్కొన్నారు. వీరిద్దరి స్నేహం ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. బీజేపీ(BJP) నేతలకు కూడా అంతా తెలుసని, కానీ పలువురు బీజేపీ నేతలు మాత్రం మోడీ అంటే భయపడుతున్నారని చెప్పుకొచ్చారు.
మరోవైపు అదానీపై తన తర్వాత ప్రసంగం గురించి ప్రధాని మోదీ(modi) భయపడుతున్నారని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన కళ్లలో భయం కనిపించిందని, అందుకే తనను పార్లమెంట్లో మాట్లాడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మరోవైపు దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఇంతకుముందు చాలాసార్లు చెప్పానని రాహుల్ అన్నారు. ఇందుకు ఉదాహరణలు మనం రోజూ చూస్తూనే ఉన్నామని గుర్తు చేశారు.