తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, వర్షం పడే సమయంలో ప్రజలెవరూ చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణ(Telangana)లో వర్షాలు దంచికొట్టనున్నాయి. మరో 2 రోజులు పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు(Rain) పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని ఖమ్మం, ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert)ను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rain) పడే అవకాశం ఉందని, ఆదివారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, వర్షం పడే సమయంలో ప్రజలెవరూ చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ సూచించింది.
గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల(Rain)కు, వడగళ్ల వానకు కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పంటలు బాగా దెబ్బతిన్నాయి. వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసి ముద్దయ్యాయని రైతులు(Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు మొక్కజొన్న పంట తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లా చెన్నూర్, నిర్మల్ జిల్లా కుంటాల, బైంసా, ఆదిలాబాద్ జిల్లా బోథ్, ఇచ్చోడ, తలమడుగు, తాంసిలో మొక్కజొన్న, మిర్చి పంటలు నాశనం కాగా కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలో వడగళ్ళవానకి తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు(Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.