BPT: మొంథా తుపాన్పై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు వార్తలు పంచే లేదా ఫార్వర్డ్ చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం హెచ్చరించారు. అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని సూచించారు. అత్యవసర సహాయానికి 112 లేదా 8333813228కు కాల్ చేయాలని పేర్కొన్నారు.