TS RTC : ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు
తెలంగాణ (Telangana) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్త్రెవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు బెంగళూరు(Bangalore), హుబ్లీ, ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు (Tamil Nadu) లోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడపనుంది.
తెలంగాణ (Telangana) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్త్రెవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు బెంగళూరు(Bangalore), హుబ్లీ, ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు (Tamil Nadu) లోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడపనుంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను సంస్థ ప్రారంభించింది.
12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్‌ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ (Mobile charging) సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై (Free Wi-Fi) సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ (TS RTC) యాజమాన్యం నిర్ణయించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు ‘లహరి-అమ్మఒడి (Lahari-Ammaodi) అనుభూతి’గా నామకరణం చేసింది.
ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBusespic.twitter.com/WBrFy37xmt
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) March 26, 2023